Pulwama-like terror attack averted in J&K పూల్వామా తరహా మారణహోమానికి కుట్ర.. భగ్నం చేసిన ఆర్మీ

2019 like bombing stopped in pulwama 40 kg ied in car driver escapes

Pulwama like terror attack, IED, car, Pulwama, Jammu and Kashmir, Pulwama IED, Pulwama suicide attack, J&K Pulwama attack, Terrorists, Indian Army, JeM, LeT, Hizb-ul-Mujahideen, Jammu Kashmir, Rajpora, terror attack averted, Pakistan, Pulwama 2, kashmir, CRPF jawans, Indian Army, Army officers, terror attack averted

Security forces including intelligence, army, police averted a Pulwama-like terror attack in Jammu and Kashmir's Ayengund area of Rajpora, Pulwama after forces neutralised an IED recovered from a car. The terrorists were planning to target a convoy of 20-25 vehicles that was to carry close to 400 soldiers, commanders and army officers.

ITEMVIDEOS: పూల్వామా తరహా మారణహోమానికి కుట్ర.. భగ్నం చేసిన ఆర్మీ

Posted: 05/28/2020 07:16 PM IST
2019 like bombing stopped in pulwama 40 kg ied in car driver escapes

గత ఏడాది జరిగిన పుల్వామా దాడి గుర్తుందా.? ఆర్మీ వాహనాల్లో తమ శిబిరాలకు చేరుకుంటున్న సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ గా చేసుకుని ఢీకోనింది ఓ కారు. ఆ విస్పోటనానికి తమ వాహనాల్లోంది దిగిన బలగాలపై అప్పటికే మాటువేసిన ముష్కరులు కాల్పులు జరిపి ఏకంగా నలభై మంది భద్రతా బలగాలను అమరుల్ని చేసింది. సరిగ్గా అదే తరహాలో రోడ్డు మార్గంలో వచ్చే భారత భద్రతా బలగాలకు చెందిన వాహానాలను లో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత ఆర్మీ, జమ్మూ పోలీసులు సకాలంలో గుర్తించి భగ్నం చేయగలిగాయి.

మరోమారు అదే పంథాలో పెను విధ్వంసానికి, భారత ఆర్మీ జవాన్ల ప్రాణాలను హరించేందుకు కుట్రపన్నారు. అయితే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల నిజస్వరూపం తెలిసిన భారత ఇంటెలిజెన్స్ విభాగం.. పుల్వామా దాడి నేపథ్యంలో విమర్శలను ఎదుర్కోన్న నేపథ్యంలో ఇక అప్పటి నుంచి అప్రమత్తమైంది. ఉగ్రవాదుల స్లీపింగ్ సెల్స్, సహా ముష్కరులపై గట్టి నిఘాలను ఏర్పాటు చేయడంతో వారికి ఈ మేరకు ఉప్పందంది. దీంతో భద్రతా బలగాలకు సమాచారం అందించగానే అటు ఆర్మీ, ఇటు జమ్మూ పోలీసులు సంయుక్తంగా తీవ్రవాదుల కుట్రను భగ్నం చేశారు.

ముష్కరులు కారులో బాంబును అమర్చి ఏకంగా 400 మంది ప్రాణాలను హరించేందుకు సిద్దమయ్యారని వార్తలు అందుతున్నాయి. కారు డిక్కీలో ఒక డ్రమ్ము నిండా ఐఈఢీ పేలుడు పధార్థాలను పెట్టి పేల్చడానికి అంతా సిద్దం చేశారు. అయితే ఇంటెలిజెన్స్ విభాగాలకు సకాలంలో సమాచారం అందడం.. దాంతో పాటు భద్రతా బలగాలు కూడా సకాలంలో కారు నిలిపిన ప్రాంతానికి చేరుకోవడంతో కుట్రను భగ్నం చేశాయి. అయితే పేలుడు పధర్థాలతో వస్తున్న కారును పోలీసులు ఆర్మీ చుట్టుముట్టడంతో కారును అక్కడకు తీసుకువచ్చిన ముష్కరుడు మాత్రం తప్పించుకోగలిగాడు.

కారులో పేలుడు సామాగ్రితో ఓ ఉగ్రవాది సంచరిస్తున్నట్లు పుల్వామా పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో పోలీసులు పలు కూడళ్ల వద్ద తనిఖీలు చేపట్టారు. కాగా నిన్న రాత్రి రాజ్ పోరా పరిధిలోని అయన్ గుండ్ ప్రాంతంలొ ఒకచోట ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ వద్ద పోలీసులను గమనించిన ఈ కారు చోదకుడు.. భద్రతా బలగాలు అపుమని చెబుతున్నా పట్టించుకోకుండా బారికేడ్లను తోసుకుని. ముందుకు కదిలాడు, బలగాలు అప్రమత్తమై కారుపై కాల్పులు జరిపాయి. అనుమానిత వాహనాన్ని నడిపిన చోదకుడు పారిపోయాడు. పోలీసుల తనిఖీల్లో కారు డిక్కీలో భారీ డ్రమ్ములో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తించారు. బాంబు స్కాడ్ రంగంలోకి దిగి వాటిని ఇవాళ పేల్చివేశాయి. ఆ సమయంలోనే స్థానికులను అక్కడి నుంచి దూరప్రాంతాలకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles