Telangana reports 107 Cororna Cases in 24 hours తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో.. 107 కేసులు..

Covid 19 update with 107 cases telangana records highest single day spike

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The coronavirus positive cases in Telangana State have hit a new high with health authorities on Wednesday reporting 107 Covid-19 positive cases and six fatalities. The cumulative tally of Covid-19 infections so far in Telangana State has also crossed the 2000 mark on Wednesday. Telangana reported 71 new cases of COVID-19 on Wednesday, taking the total positive cases in the state to 1,991. Out of all 71 new positive cases 38 reported were from the jurisdiction of the GHMC, and one positive case each from Vikarabad, Nalgonda, Narayanpet, Suryapet districts.

కరోనా విజృంభన: తెలంగాణలో రెండు వేల మార్కు దాటిన పాజిటివ్ కేసులు..

Posted: 05/28/2020 12:12 AM IST
Covid 19 update with 107 cases telangana records highest single day spike

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసులకు తోడు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో కూడా కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్యాధికారులు, డాక్లర్లు ఎంతగానో శ్రమిస్తున్నా.. ఉపశమనం లభించే వాతావరణం మాత్రం అప్పుడే కనిపించడం లేదు. మరణాలు కూడా అంతకంతకూ పెరగుతూ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. 

ఈ నెల 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాగా ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. ఇక తాజాగా నమోదైన కేసులు గ్రేటర్ వాసులను మరింత అందోళనకు గురిచేస్తోంది. ఇవాళ రాష్ట్రంలో మరో ఆరు కరోనా మరణాలు సంభవించాయి, దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 63కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం. ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా కేసులు కూడా కలవరాన్ని రేపుతున్నాయి.

బుధవారం విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. నిన్న 71 కేసులు నమోదైన తెలంగాణలో ఇవాళ ఏకంగా 107 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 2098కి  చేరుకున్నాయి. వీటిలో అత్యధిక కరోనా కేసులు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారివే కావడం గమనార్హం, ఇక రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు కూడా కరోనా పాజిటివ్ వచ్చినవారి జాబితాలో వున్నారు. మొత్తం 107 కేసుల్లో 49 కరోనా కేసులు సౌధీ అరేబియా నుంచి వచ్చినవారివే. ఇక వలస కార్మికుల్లో 19 మందికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. కాగా, ఇవాళ రాష్ట్రంలో 39 కరోనా కేసులు నమోదైయ్యాయి. 

తాజాగా నమోదైన కరోనా కేసులతో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 2000 మార్కును దాటింది. ఇవాళ నమోదైన 107 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 2098 కేసులు నమోదయ్యాయి, ఇక ఇవాళ రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికంగానే సంభవించాయి, ఏకంగా ఆరుగురు ఇవాళ కరోనా బారిన పడి చికిత్స పోందుతూ అసువులుబాసారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 63కు చేరింది. ఇవాళ 37 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అవగా.. ఇప్పటివరకు 1,321 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 714 యాక్టివ్‌ కేసులు వున్నాయని వారంతా గాంధీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh