Kerala Couple Conducts Wedding over Zoom app పోస్టులో మంగళసూత్రం.. జూమ్ లో ఆశీర్వచనం.. డిజిటల్ కళ్యాణం..

Kerala couple conducts wedding over zoom app parents send mangalsutra via speed post

coronavirus wedding, covid-19, kerala couple, lockdown wedding, novel coronavirus, virtual wedding, wedding during lockdown, wedding over zoom call, Zoom call wedding, zoom wedding, coronavirus, Kerala couple, wedding, covid-19, lockdown restrictions, Zoom APP, Postal Department, Digital wedding, Pune, Maharashtra

A young Kerala couple undeterred by the COVID-19 pandemic decided to go ahead with their planned marriage ceremony. In order to ensure social distancing, the couple named Vignesh KM and Anjali Ranjith took the help of the video conferencing app Zoom to turn their wedding celebration into a memorable one.

పోస్టులో మంగళసూత్రం.. జూమ్ లో ఆశీర్వచనం.. ఇదో డిజిటల్ కళ్యాణం..

Posted: 05/27/2020 07:05 PM IST
Kerala couple conducts wedding over zoom app parents send mangalsutra via speed post

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లేంటే అది.. అని సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసినా.. లేక పెళ్లేంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. అంటూ రాసిన మహాసినీకవి ఆత్రేయ చెప్పినా.. ఇప్పుటి రోజులకు అవి సరిపోవడం లేదు. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. దానిని నియంత్రించేందుకు అమలుపరుస్తున్న లాక్ డౌన్ నిబంధనలు కాదని ఎవరూ బంధుజనం సాక్షిగా, మేళతాళాల మధ్య, వేదమంత్రోచ్చరణల మధ్య, బంధువులు సరదాలు, మిత్రుల ఆటపట్టించడాలతో కల్యాణమంటే ఎప్పటికి జరిగేనో.

ఈ నిబంధనల నేపథ్యంలో ప్రస్తుతం డిజిటల్ వివాహాలు రూపుదిద్దుకుంటున్నాయి. బంధుమిత్రులు అందరూ ఎక్కడివారు అక్కడి నుంచే వధూవరులను ఆశీర్వదించవచ్చు. అదేంటి అంటారా.? ఇదే డిజిటల్ పెళ్లి. ఈ తరహా వినూత్న రీతిలో వివాహం చేసుకుంది ఓ కేరళ జంట, ఈ తరహాలో తమ పెళ్లి జరగడం.. కనీసం తల్లిదండ్రులు కూడా రాలేని పరిస్థితిలో వారికి ఈ పెళ్లిని దూరం నుంచే వీక్షించే సదుపాయం కల్పించిందీ జంట. అంతేకాదు వధువరుల తల్లిదండ్రులు కూడా పోస్టల్ శాఖ సహాయంతో కళ్యాణ సమయానికి జంటకు మంగళసూత్రాన్ని అందజేయగలిగారు. అంతా సవ్యంగా జరగడంతో అటు రెండు కుటుంబాలతో పాటు ఇటు బంధుమిత్రులు, నూతన జంట అంతా ఎంతో హ్యాపీగా వున్నారు.

ఈ పెళ్లిపై నూతన జంట మాట్లాడుతూ ఈ క్షణాలు తమ జీవితాంతం గుర్తుండి పోతాయని అన్నారు. ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఆంక్షలు, నిబంధనల నడుమ వివాహాలు చేసుకోలేమని, పెళ్లింటే హంగూ, ఆర్భాటమని అనుకునే వాళ్లు పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. ఇక ప్రభుత్వం ఆంక్షలకు లోబడి మరికొందరు వేళ్లపై లెక్కబెట్టే సంఖ్యలో బంధువుల హాజరుతో వివాహాలు చేసుకున్నారు. ఈ సమయంలో కేరళకు చెందిన విఘ్నేష్, అంజలి జంట మాత్రం తమ పెళ్లిని వాయిదా వేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పింది.

అలా అని అందరిలా పరిమిత సంఖ్యలో బందువులతో మమ అనిపించుకోలేమని చెప్పారు. మధ్యేమార్గంగా వారు ఎంచుకున్న మార్గం డిజిటల్ వివాహం. ఏడాది క్రితమే వివాహం నిశ్చయమైన ఈ జంట పూణెలో పని చేస్తుండగా.. మే నెలలో పెళ్లి తేదీని ఫిక్స్ చేశారు. దీంతో వీరు కళ్యాణం కోసం కేరళకు వెళ్దామనుకున్న సమయంలో అకస్మికంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చి.. రవాణా స్థంభించిపోయింది. దీంతో పూణెలో వున్న వధూవరులు తమ స్నేహితులతో కలసి డిజిటల్ కళ్యాణానికి వేదిక ఏర్పాటు చేశారు.

దీంతో వధూవరుల తల్లిదండ్రులు వధువు మెడలో మంగళసూత్రాన్ని పోస్టల్ శాఖ సాయంతో స్పీడ్ పోస్టులో పంపించారు. పోస్టల్ శాఖ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా సరిగ్గా సమయానికి మాంగళ్యాన్ని చేర్చింది. ఇక డిజిటల్ వివాహంలో భాగంగా వధువరుల తల్లిదండ్రులు, బందుమిత్రులు వారి వివాహాన్ని జూమ్ యాప్ లో తిలకించి అశీర్వదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ స్నేహితులు, బంధువులు పెళ్లిని చూశారని, ఇదో భిన్నమైన అనుభూతని ఈ సందర్భంగా అంజలి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లలేమని భావించిన తరువాతనే పూణెలోనే పెళ్లికి సిద్ధమయ్యామని వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh