All Family of Mutton Trader in Hyderabad tested positive పార్టీ చేసుకుని పలువురి ప్రాణాల మీదకు తెచ్చిన మటన్ వ్యాపారి..

All family members of mutton trader in hyderabad tested positive including relatives

coronavirus, cgvid-19, Coronavirus Positive Cases, Mutton Merchant House · Hyderabad · Telangana · Coronavirus Positive, Coronavirus, Mutton merchant, celebration, Coronavirus spread, Pahadi sherif, coronavirus, cgvid-19, lockdown, Hyderabad, telanagana

A Mutton Vendor family with 14 members tested positive for coronavirus in Pahadi sherif area of Hyderabad who had invites few relatives and friends to the party. Out of 48 members neraly 22 members were tested positive with coronavirus.

పార్టీ చేసుకుని పలువురి ప్రాణాల మీదకు తెచ్చిన మటన్ వ్యాపారి..

Posted: 05/27/2020 06:36 PM IST
All family members of mutton trader in hyderabad tested positive including relatives

కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడా జనసందోహంతో కూడిన కార్యాలు చేయకూడదని, పెళ్లిళ్లు, మరణాలకు మాత్రమే ప్రస్తుతానికి పరిమితి సంఖ్యలో అనుమతి వుందని అధికారులు ఎన్నో ఆంక్షలు పెడుతున్నా.. దానిని ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతీ ఏడాది చేసుకునే వేడుకను ఈ సారి లాక్ డౌన్ ఆంక్షల నడుమ కూడా చేసుకుని తన బంధుమిత్రుల ప్రాణాల మీదకు తీసుకువచ్చాడో మాంసం వ్యాపారి. అంతేకాదు తన కుటుంబంలోని 14 మందికి కూడా కరోనా మహమ్మారి సోకేందుకు కారణమయ్యాడు. లోకం ఎంత అందోళన చెందుతుందోనన్న విషయాన్ని మర్చి తన సరదాలు మాత్రం తీరాల్సిందేనని పూనుకున్నారు. ఫలితంగా 22 మంది కరోనా బారిన పడేవారే కాదు.

తన ఇంట్లో జరిగిన వేడుకలో కరోనా ఎలా ప్రవేశిస్తుందని అనుకున్నాడో ఏమో కానీ.. కరోనా బారిన తన కుటుంబంతో పాటు బంధుమిత్రులు కూడా చికిత్స పోందుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు ఫహాడీషరీఫ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పహాడీషరీఫ్ లో ఓ మాంసం దుకాణం వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. ప్రతి ఏడాది వేసవి కాలంలో ఈ కుటుంబానికి చెందిన పలువురు స్నేహితులు, బంధువులతో కలసి ఒకచోట చేరి సరదాగా వేడుకలు జరుపుకుంటారు. యధావిధిగా ఈ ఏడాది పార్టీ చేసుకోవాలని సంకల్పించారు. యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కళారా నృత్యానికి జడుస్తూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్న తరుణంలో ఈ నాలుగు కుటుంబాలు మాత్రం పది రోజుల క్రితం పార్టీ పేరుతో సరదాను తీర్చుకున్నాయి. అంతా అకయ్యాక వారిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

అయితే వీరితో పాటు నగరంలోని కరోనా ప్రభావిత హాట్ స్పాట్ గా నిలిచిన జియాగూడ నుంచి కూడా పార్టీకి పలువురు హాజరయ్యారు. వీరితో పాటు గౌలిపురా, బోరబండ ప్రాంతాల నుంచి ముగ్గురి చొప్పున, సంతోష్ నగర్ నుంచి ఐదుగురు మొత్తంగా మరో 14 మంది పార్టీలో భాగమయ్యారు. మొత్తంగా 45 నుంచి 50 మంది వరకు ఈ పార్టీకి హాజరై వేడుక చేసుకున్నారు. కాగా, ఈ పార్టీకి హాజరైన వారిలో 18 మంది మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ వేడుకలు ముగించుకుని మహేశ్వరం మండలం హర్షగూడలో కిరాణ దుకాణం నడిపించే బంధువు ఇంటికి వచ్చారు. అతడి కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి మరోసారి పార్టీ చేసుకున్నారు.

ఐదు రోజుల తరువాత ఈ పార్టీకి హాజరైన వారిలో ఐదుగురికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. సంతోష్ నగర్ కు చెందిన ఇద్దరితో పాటు బోరబండకు చెందిన ముగ్గురిలో కరోనా లక్షణాలు కన్పించడంతో వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ కేసులుగా నిర్థారణ అయ్యింది. దీంతో పహాడీ షరీఫ్ లో మాంసం వ్యాపారి ఇంట్లో జరిగిన వేడుకల విషయం వైద్యాధికారుల దృష్టికి చేరింది. దీంతో ఈ వేడుకలకు హాజరైన వారందరి జాబితాను తెలుసుకున్న అధికారులు వారందరినీ ఈ నెల 23 నుంచి హోం క్వారంటైన్ లో ఉంచారు. ఇక తాజాగా వీరిందరికీ పరీక్షలు చేయగా, అందులో 13 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ వేడుకలకు హాజరైన కిరాణ వ్యాపారి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా వారందరికీ కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh