WHO suspends hydroxychloroquine trial కరోనా వైరస్ చికిత్సకు ఆ మందును వాడవద్దు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Major advocate of hydroxychloroquine told by who to stop using it

US, World Health Organisation, corona virus, Indonesia, Hydroxychloroquine, malaria drug, safety concerns ,Pharmaceuticals (TRBC), Enterprise Reporting, Pharmaceuticals and Medical Research (TRBC), Science, Medical Regulatory Issues, Respiratory Conditions, Indonesia, Communicable Diseases, Epidemics

The World Health Organization has urged Indonesia, one of the world’s biggest advocates of two malaria drugs to treat the coronavirus, to suspend such treatment over safety concerns, a source familiar with the advice told Reuters on Tuesday.

కరోనా వైరస్ చికిత్సకు ఆ మందును వాడవద్దు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Posted: 05/27/2020 12:17 AM IST
Major advocate of hydroxychloroquine told by who to stop using it

కరోనా వైరస్ మహమ్మారి సోకిన రోగులను కాపాడుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పలు ఔషధాలను చికిత్సలో వినియోగిస్తున్నాయి, ఈ వైరస్ నయయ్యేందుకు ఔషధం లేకపోవడంతో ఒక్కో వైద్యుడు ఒక్క విధంగా చికిత్స చేస్తున్నారు. అయితే మనదేశంలో మాత్రం ఐసీఎంఆర్ ఇచ్చిన మార్గదర్శకాలపై వైద్యులు తమ చికిత్సా విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను క్లోరోక్వీన్ మందును తీసుకోవడం ఆపివేశానని చెప్పడంతో.. ఆ మరుసటి రోజునే ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

కరోనా నివారణకు ప్రస్తుతం ప్రపంచదేశాలు వాడుతున్న ఔషదం క్లోరోక్వీన్. ఓ వైపు కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నా.. మరోవైపు ప్రస్తుతం చికిత్స నేపథ్యంలో వైరస్ సోకినవారికి మలేరియా రోగులకు ఇచ్చే మందు ఇప్పుడు వాడుతున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు కరోనా వైరస్ బాధితులకు తక్షణ చికిత్సకు అందిస్తున్నారు. అందుకే ఇటీవల అమెరికాతో పాటు పలు దేశాలు భారతదేశ సహాయం కోరాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు భారతదేశం లో అధికంగా ఉండడంతో ఆ దేశాలు భారత్కు విజ్ఞప్తులు చేస్తున్నాయి.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా రోగులకు మలేరియాకి మందుగా వాడే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వడాన్ని కొంత కాలం ఆపాల్సిందిగా ప్రకటన చేసింది. కోవిడ్-19 రోగులకు ఈ ఔషధం ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది మరణిస్తున్నారంటూ ఇటీవల లాన్సెట్ లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ క్రమంలో కొంతకాలం పాటు క్లినికల్ ట్రయల్స్ లో ఈ మందు ఇవ్వడం ఆపాలంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాలిడారిటీ ట్రయల్స్ పేరిట చాలా దేశాలు.. కరోనాకి మందు కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

అయితే.. ఈ పరీక్షల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని మాత్రం నిలిపివేయాలని చెప్పారు. కేవలం ఈ మందుపై మాత్రమే తాత్కాలిక నిషేధం విధించామని.. ఇతర క్లినికల్ ట్రయల్స్ యాథావిధిగా కొనసాగించవచ్చని చెప్పారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా ఆర్థరైటిస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు, ఇక ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ తో పాటు బ్రెజిల్ ఆరోగ్య మంత్రి కూడా గత వారం హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు మలేరియా వ్యతిరేక క్లోరోక్విన్ ని కరోనా రోగులకు ఉపయోగించాలని సిఫారసు చేశారు. రెండు మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను, ముఖ్యంగా గుండె అరిథ్మియాను ఉత్పత్తి చేస్తాయని లాన్సెట్ అధ్యయనం కనుగొంది. దీంతో.. దీనిపై డబ్ల్యూహెచ్ఓ తాత్కాలిక నిషేధం విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles