Coronavirus: 1.45 Lakh Cases In India So Far, 4167 Deaths దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 7వేల కొత్త కేసులు

Coronavirus update covid 19 cases in india reach 1 45 lakh 4167 deaths

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India recorded the biggest spike in daily COVID-19 count as states had registered 6,535 fresh cases in last 24 hours. India overtook Iran to become the 10th nation among the countries worst-hit by coronavirus pandemic. The total number coronavirus patients in the country stood at 1.45 Lakh. Death toll has increased to 4167 after 146 patients passed away in last 24 hours.

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 7వేల కొత్త కేసులు

Posted: 05/27/2020 12:29 AM IST
Coronavirus update covid 19 cases in india reach 1 45 lakh 4167 deaths

(Image source from: Headlineenglish.com)

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన జనవరి 30వ నుంచి 111 రోజుల్లో లక్ష మార్కును చేరిన కరోనా కేసులు.. ఆ తరువాత వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ఉగ్రరూపాన్ని దాల్చుతుంది. దేశంలో కరోనా కేసులు సంఖ్య అంతకంతకూ పెరగుతుండటంతో పాటు ఇప్పటివరకు నమోదు కానీ సంఖ్యలో అత్యధికంగా కేసులు నమోదు కావడం అందోళనను రేకెత్తిస్తోంది. 48 గంటల క్రితం నమోదైన కేసులు తరువాత కాసింత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ దేశంగా నిలిచిన భారత్.. తాజా కేసుల నమోదుతో పదవ స్థానానికి చేరడం కలవరంపరుస్తోంది. 

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా ఆరున్నర వేలకు పైబడిన కరోనా కేసులు నమోదయ్యాయి, 6535 కొత్త పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,45,380 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 146 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 4168కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా అత్యధిక మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.

గత పన్నెండు రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 60,491 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 80,722 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి మరణిస్తున్న వారిలో మన దేశంలో 3.5 శాతంగా వుందని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2436 కేసులు నమోదు కావడంతో పాటు 60 మరణాలు కూడా సంభవించాయి. దేశంలో నమోదైన కేసుల్లో మూడింట ఒక్క వంతు కేసులు ఇక్కడే నమోదు కావడం.. ఆ సంఖ్య యాభై వేల మార్కు దాటడం కూడా అందోళన రేపుతోంది. ఇక మహారాష్ట్రలో మరణాలు కూడా అత్యధికంగా మరణాలు కూడా సంభవించడం అందోళనకరం. రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 52667కు చేరగా, ఏకంగా 1708 మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత కరోనా ఉదృతి కరోనా ఉగ్రరూపాన్ని చూపుతోంది. అరవ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 805 కరోనా కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు సంఖ్య 17082కు చేరగా, 118 మరణాలు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles