Central minister threatens to thrash Chhattisgarh officials అధికారులకు కేంద్రమంత్రి రేణుకా సింగ్ సీరియన్ వార్నింగ్..

Union minister renuka singh caught on camera threatening workers at quarantine center

Renuka Singh, Union Minister of State for Tribal Affairs, threatens officials, quarantine centre, BJP workers, Balarampur district, Chhattisgarh, Politics

The Union Minister of State for Tribal Affairs Renuka Singh, in a video was seen threatening administration officials in Chhattisgarh for allegedly beating a man up in a quarantine centre and showing bias against BJP workers.

అధికారులకు కేంద్రమంత్రి రేణుకా సింగ్ సీరియన్ వార్నింగ్..

Posted: 05/25/2020 11:33 AM IST
Union minister renuka singh caught on camera threatening workers at quarantine center

కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయమంత్రి రేణుకా సింగ్ వార్తల్లో కెక్కారు. అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమ వారిని తనదైన శైలిలో హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే బుద్దిచెప్పడం తమకు తెలుసునని అన్నారు. బెల్టుతో బాదడం తనకు కొత్తేమీ కాదంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనూ తమ అజమాయిషీనే చలామణి అయ్యేలా, తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు ఎక్కడి కించిత్ గౌరవం తగ్గకూడదన్నట్లు వ్యవహరించిన అమె తీరు అక్షేపనీయంగా మారుతోంది.

చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో ఓ వ్యక్తిపై అధికారులు దాడి చేశారన్న వార్తలతో కేంద్రమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చి.. పరిస్థితిని సమీక్షించారు. అసలేం జరిగిందీ అంటే.. అదే జిల్లాకు చెందిన దిలీప్ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్ కేంద్రంలో అధికారులు కల్పిస్తున్న సదుపాయాలు బాగా లేవని ఫిర్యాదు చేశాడు. కాగా కేంద్రమంత్రికి ఇక్కడి విషయాలపై ఫిర్యాదు చేశాడన్న కోపంతో క్వారంటైన్ కేంద్రం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తహసీల్దార్ తనపై దాడి చేశారని దిలీప్ గుప్తా ఆరోపించాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర సహాయమంత్రి రేణుకా సింగ్ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు.

జరిగిన ఘటనపై దిలీప్ గుప్తా, అతని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి అధికారులపై మండిపడ్డారు. కాషాయం ధరించిన బీజేపీ కార్యకర్తలను బలహీనులుగా భావించవద్దని స్పష్టం చేశారు. గదిలో పడేసి బెల్టుతో బాదడం ఎలాగో నాకు బాగా తెలుసు అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ కార్యకర్తల పట్ల మీరు చూపిస్తున్న వివక్షను విడనాడండి అంటూ గట్టిగా చెప్పారు. అయితే క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు అందరికీ ఒకేలా వుంటాయి తప్ప.. మనిషి మనిషి వత్యాసం వుండదని, ఇక్కడి వచ్చి అధికారులపై హుకుం చెలాయించి.. రాజకీయాలు చేస్తున్న కేంద్రమంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles