AP HC cancels GO 623, asks explanation రంగులపై సర్కార్ జీవోను రద్దు చేసిన హైకోర్టు.. ధిక్కారంపై వివరణకు అదేశం

Ap high court cancels go 623 asks govt to give an explanation over it

High Court, Contempt of Court, Chief Secretary, Panchayat Raj department, election commissioner, YSRCP Party Colours, YCP Govt. CM YS Jagan, Vijayawada, Andhra Pradesh, Politics

In a rude shock to the government of Andhra Pradesh, the High Court has cancelled the GO 623, which was given over the painting of colours to panchayat offices across the state. The High Court has asked for an explanation as to why the new GO had to be released and ordered to give clarification by 28 of this month.

రంగులపై సర్కార్ జీవోను రద్దు చేసిన హైకోర్టు.. ధిక్కారంపై వివరణకు అదేశం

Posted: 05/22/2020 11:56 AM IST
Ap high court cancels go 623 asks govt to give an explanation over it

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలను ధిక్కరిస్తూ జీవోలను విడుదల చేయడంపై మండిపడిన న్యాయస్థానం కోర్టు ధిక్కారణ విచారణను కూడా కొనసాగించాలని అదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడంపై ఆక్షేపించి.. వాటిపై రంగులు మార్చవద్దని అదేశాలు ఇచ్చిన తరువాత జీవోలు జారీ చేయడంపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాము జారీ చేసిన అదేశాలను కూడా పట్టించుకోకుండా రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేయడం ఏంటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను రద్దు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం మరో రంగును అదనంగా వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారించింది.

ఆఫీసులకు వేస్తున్న కొత్త రంగులు కూడా పార్టీ రంగులను పోలి  ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని  ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు. సర్కారు వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్‌, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని వివరించింది. ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles