COVID-19 | 62 fresh cases reported in AP ఏపీలో 2500 మార్కు దాటిన కరోనా కేసులు.. 55 మరణాలు

Coronavirus in ap 62 new covid 19 cases state tally reaches 2514 death toll at 55

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 2514 after 62 new cases were reported in the last 24 hours, out of which 1731 have so far recovered and have been discharged, while 55 have died, the state health department said.

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో 62 కేసులు..

Posted: 05/22/2020 12:49 PM IST
Coronavirus in ap 62 new covid 19 cases state tally reaches 2514 death toll at 55

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంతో కాసింత వేగాన్ని తగ్గించుకున్న కరోనా వ్యాప్తి..  గత మూడు రోజులుగా తన వేగాన్ని మళ్లీ పెంచుకుంది. తాజాగా రాష్ట్రంలో యాభై మార్కుకు పైబడి కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మిషన్ కార్యక్రమాలు చేపట్టినా వైరస్ తన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 62 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా నమోదైన 62 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2500 మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 2514కి చేరింది. కాగా రాష్ట్రంలో తాజాగా కృష్ణా జిల్లాలో మరో వ్యక్తి కరోనా బారినపడి చికిత్స పోందుతూ మరణించాడు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య కూడా 55కు చేరింది. అయితే తమిళనాడులోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారితోనే ఇవాళ కేసులన్నీ నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో కొత్తగా నమదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 4, నెల్లూరులో 14 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా వున్నాయి. కాగా వివిద ఆసుపత్రుల్లో 728 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 51 మంది వ్యాధి నుంచి కోలుకుని ఢిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి కొలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1731కి చేరింది. ఈ మార్కెట్ కు చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరివాసులు వెళ్లడంతో అక్కడే ఎక్కువగా కేసులు నమదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles