COVID-19 | 45 fresh cases reported in AP ఏపీలో 2400 మార్కు దాటిన కరోనా కేసులు.. 54 మరణాలు

Coronavirus in ap 45 new covid 19 cases state tally reaches 2452 death toll at 54

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 2452 after 45 new cases were reported in the last 24 hours, out of which 1689 have so far recovered and have been discharged, while 54 have died, the state health department said on Thursday.

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో 45 కేసులు..

Posted: 05/21/2020 12:46 PM IST
Coronavirus in ap 45 new covid 19 cases state tally reaches 2452 death toll at 54

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంతో కాసింత వేగాన్ని తగ్గించుకున్న కరోనా వ్యాప్తి..  గత రెండు రోజులుగా తన వేగాన్ని మళ్లీ పెంచుకుంది. తాజాగా రాష్ట్రంలో యాభై మార్కుకు పైబడి కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మిషన్ కార్యక్రమాలు చేపట్టినా వైరస్ తన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 45 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా నమోదైన 45 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2452 మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 2452కి చేరింది. కాగా రాష్ట్రంలో తాజాగా నమోదైన కరోనా మరణంతో మరణాల సంఖ్య కూడా 54కు చేరింది. అయితే తమిళనాడులోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారితోనే ఇవాళ కేసులన్నీ నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మార్కెట్ కు చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరివాసులు వెళ్లడంతో అక్కడే ఎక్కువగా కేసులు నమదయ్యాయి.

రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనావైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా వున్నాయి. నిన్నటివరకు మొత్తం 53 మరణాలు సంభవించగా, ఇవాళ నెల్లూరులో సంభవించిన తాజా మరణంతో ఈ సంఖ్య 54కు చేరింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుతున్న నేపథ్యంలో రాష్ట్రవాసులు అందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1689కి చేరగా, 718 మంది కరోనావైరస్ గ్రస్థులు రాష్ట్రంలోని వివిధ అసుపత్రులలో చికిత్స పోందున్నారు, తాజాగా నమోదైన కేసుల్లో  చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చిన వారివేనని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh