Railways To Run 200 Non-AC Trains Daily జూన్ 1 నుంచి పరుగులు పెట్టనున్న నాన్ ఏసీ రైళ్లు

Railways to run 200 non ac trains daily from june 1 online bookings soon

Railways, trains to run from June 1, Lockdown, IRCTC Special Trains, Indian Railways, Social distancing, corornavirus, covid_19

Passenger train service will expand from the existing 15 trains to more than 200 starting next month. The service will involve non-air conditioned trains, which had not been allowed so far.

జూన్ 1 నుంచి పరుగులు పెట్టనున్న నాన్ ఏసీ రైళ్లు

Posted: 05/20/2020 12:00 PM IST
Railways to run 200 non ac trains daily from june 1 online bookings soon

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన నాల్గవ విడత లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునే  ప్రయత్నాలు కేంద్రప్రభుత్వం తెరలేపింది. ఈ తరుణంలో స్థంభించిన జనజీవనం మళ్లీ బతుకు బండిని లాగేందుకు సమాయత్తం అయ్యింది. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం కూడా రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రైళ్లకు కూడా పచ్చజెండా ఊపనుంది. ఇప్పటికే రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. రైళ్లు నడిపేందుకు కూడా సిద్దమవుతోంది.

ప్రస్తుతం వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్‌ మాత్రమే తిరుగుతుండగా.. జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు నడపబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 200 నాన్- ఏసీ సెకండ్ రైళ్లు జూన్ 1వ తేది నుంచి తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ కూడా తెలిపింది.

కాగా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లు ప్రయాణాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆ మధ్యన రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైళ్లను నడపడం వలన కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ సహా పలువురు ముఖ్యమంత్రులు తెలపడంతో.. జూన్ 30 వరకు ప్రయాణికులు బుక్‌ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆ డబ్బులు మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles