HC Gives Green Signal For 10th Exams In Telangana తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు ఆంక్షలు

Tenth class exams can be held from june 8 says telangana high court

Tenth class exams, State Secondary Board Exams, High Court, Telangana Government, Social distancing, Corona cases, June 3rd review, Students

Telangana High Court has given a green signal for the conduct of the SSC examinations in the State from June 8, but suggested that certain measures have to be initiated by the Government.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు ఆంక్షలు

Posted: 05/19/2020 02:32 PM IST
Tenth class exams can be held from june 8 says telangana high court

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వాయిదా పడ్డ తెలంగాణ పదోతరగతి‌ పరీక్షలను మళ్లీ నిర్వహించడానికి తెలంగాణ హైకోర్టు పలు అంక్షలను విధించింది. జూన్ రెండో వారంలో పరీక్షలను నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చిన న్యాయస్థానం.. ఈ విషయమై జూన్ 4వ తేదీన కరోనా కేసులపై మరోమారు ప్రభుత్వం నివేదిక సమర్పించాలని అదేశించిన న్యాయస్థానం.. నివేదికను బట్టి నిర్ణయాన్ని తెలుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో పదవ తరగతి పరీక్షలను జూన్‌ రెండోవారంలో నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

అయితే పదో తరగతి పరీక్షలు నిర్వహణ నేపథ్యంలో కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. పరీక్షలు నిర్వహించే సమయానికి పరిస్థితి తీవ్రంగా వుంటే వాటిని వాయిదా వేయాలని కూడా సూచనలు జారీ చేసింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని చెప్పింది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా అదేశించింది. భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. అయితే, జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కారుని  హైకోర్టు ఆదేశించింది. పరీక్షలకు ముందువుండే పరిస్థితులను బట్టి మరో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ప్రభుత్వం.. కరోనా నివారణ చర్యలన్నీ తీసుకుంటాం.. విద్యార్థులకు రవాణా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు, ఐదున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. కాగా, తెలంగాణలో లాక్ డౌన్ కి ముందు పదవ తరగతికి సంబంధించిన రెండు సబ్జెక్టులకు చెందిన మూడు పరీక్షలు జరిగాయి. కాగా, మరో ఎనిమిది మిగిలి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్షల కేంద్రాల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో జులైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. కరోనా తీవ్రతను బట్టి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles