Coronavirus Cases In India Cross 1-Lakh Mark దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు.. 12 రోజుల్లో రెట్టింపైన కేసులు

Coronavirus update india cross 1 lakh mark despite world s biggest lockdown

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Coronavirus cases in India hit the grim milestone of 1-lakh mark today as new infections continued to show a daily rise of about 5,000 cases for second day in a row. India reported 4,970 new cases over the past 24 hours, taking the total Covid-19 cases in the country to 101,139. Deaths rose by 134 to 3,163.

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు.. 12 రోజుల్లో రెట్టింపైన కేసులు

Posted: 05/19/2020 11:01 AM IST
Coronavirus update india cross 1 lakh mark despite world s biggest lockdown

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన జనవరి 30వ తేదీ నుంచి మొదలుకుని ఇవాళ్టికి 111 రోజులకు ఏకంగా కరోనా కేసులు లక్ష మార్కును దాటాయి. దీంతో యావత్ ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ దేశంగా భారత్ నిలవడం అందోళన రేకెత్తుతోంది. తొలి, రెండవ విడత లాక్ డౌన్ నేపథ్యంలో అత్యంత కనిష్టంగా నమోదైన కేసులు.. మూడో విడత లాక్ డౌన్ నుంచి వేగాన్ని అందుకున్నాయి. అయితే వలస కార్మకులు వారి స్వస్థలాలకు చేరడంతో ఈ కరోనా కేసుల్లో పెరుగుదల పమోదయ్యిందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.

76 రోజుల లాక్ డౌన్ సమయంలో కేవలం పది వేల మార్కుకు మాత్రమే చేరిన కరోనా కేసుల సంఖ్య ఆ తరువాత ఎనమిది రోజుల వ్యవధిలో 20 వేల మార్కును అందుకుంది. అనంతరం ఆరు రోజుల్లో 30 వేల మార్కు, ఆ తరువాత ఐదు రోజుల్లో నలభై వేల మార్క్, ఆనంతరం నాలుగు రోజుల్లో యాభై వేల మార్కు అందుకుంది. ఇక ఇక్కడి నుంచి 12 రోజుల వ్యవధిలో మరో యాభై వేల కసులను జత కలుపుకుని ఏకంగా లక్ష మార్కును దాటింది. చివరి రెండు రోజుల వ్యవధిలో పదివేల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏకంగా సగటున రోజుకు ఐదు వేల మందికి వైరస్ సోకుతుండటం అందోళన కలిగిస్తోంది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 4970 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటాయి. లక్షా వెయ్యి 139 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 137 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 3163కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పర్కొంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది. కరోనా నేపథ్యంలో మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే గత పన్నెండు రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది.

కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 39,174 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక వేలమంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.

దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఏకంగా రెండు వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 2005 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3453058 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజునే రాస్ట్రంలో 51 మంది మరణించారు. దీంతో మొత్తంగా 1249 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ నిన్న ఒక్క రోజునే 366 కేసులు నమోదుకాగా, మొత్తం 11745 కేసులు నమోదు కాగా, 694 మంది కరోనాబారిన పడి మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles