Train accident in Maharashtra: 16 migrant workers dead మహారాష్ట్రలో ఘోరం.. వలసజీవులపై దూసుకెళ్లిన మృత్యుశకటం

Train accident in maharashtra 16 migrant workers dead after being run over by goods train near aurangabad

train accident maharashtra, nanded train accident, aurangabad train accident, train accident, migrant workers did in train accident, migrant labour, jalna, aurangabad, bhuvasal, maharashtra, madhya pradesh, goods train, Piyush Goyal, train tragedy, Crime

At least 15 migrant workers died after being run over by goods train near Jalna in Maharashtra. All the labourers were returning to Madhya Pradesh and were sleeping on the tracks when the mishap took place at about 5.15 am,

మహారాష్ట్రలో ఘోరం.. వలసజీవులపై దూసుకెళ్లిన మృత్యుశకటం

Posted: 05/08/2020 11:03 AM IST
Train accident in maharashtra 16 migrant workers dead after being run over by goods train near aurangabad

మహారాష్ట్రలోని ఔరంగబాద్ జాల్నా వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా తమ స్వగ్రామాలకు వెళ్లాలని నిర్ణయించిన వలస జీవులపై మృత్యుశకటం దూసుకెళ్లింది. మూడవ విడత లాక్ డౌన్ లో భాగంగా వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామన్న ప్రకటనలే ఆ వలసజీవుల ప్రాణాలను హరించాయి. వలస కార్మికులను వారి మానన వారిని వదిలేయడం కారణంగా రైలు పట్టాలను పట్టుకుని నడుచుకుంటూ సమీప రైల్వే స్టేషన్ వద్దకు వెళ్తున్న వలసజీవులు.. అలసిపోయి పట్టాలను ఆనుకుని నిద్రించడంతో ఏకంగా 17 మందిపై నుంచి గూడ్స్ రైలు వెళ్లడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఔరంగబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా వుందని వైద్యులు తెలిపారు. కాగా, మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్ కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మహారాష్ట్రకు వలస వచ్చిన వలస జీవులు.. జాల్నా నుంచి భువాసాల్ వరకు సుమారు 170 కిలోమీటర్ల దూరం రైలు పట్టాలను అనుసరిస్తూ బయల్దేరారు. అక్కడి నుంచి ప్రత్యేక శ్రామిక్ రైలును పట్టుకుని  మధ్యప్రదేశ్‌ లోని తమ స్వస్థలానికి వెళ్లాలని భావించారు. ఇలా బయలుదేరిన వలసజీవులు ఏకంగా 45 కిలోమీటర్ల దూరం నడిచిన తరువాత మార్గమధ్యంలో విశ్రాంతికోసం నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాడ్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కార్మికులు గూడ్స్‌రైలును రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆర్పీఎఫ్‌, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : migrant labour  jalna  aurangabad  bhuvasal  maharashtra  madhya pradesh  goods train  Piyush Goyal  train tragedy  Crime  

Other Articles