PM reviews India's efforts in vaccine against COVID-19 భారత్ లో కరోనా వాక్సీన్ తయరీపై ప్రధాని మోడీ సమీక్ష

Pm reviews status of india s efforts in developing coronavirus vaccine

Coronavirus, Coronavirus COVID-19, coronavirus vaccine in india, PM Modi, CM KCR, Biological E Ltd, Shanta Biotech, India, Telangana

Prime Minister Narendra Modi reviewed the status of India's efforts in developing a coronavirus vaccine and emphasised that what is possible in a crisis should be a part of the country's routine scientific functioning.

భారత్ లో కరోనా వాక్సీన్ తయరీపై ప్రధాని మోడీ సమీక్ష

Posted: 05/06/2020 12:22 PM IST
Pm reviews status of india s efforts in developing coronavirus vaccine

కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న లాక్ డౌన్ మూడో విడత ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్థక మందగమనంతో నెమ్మదించిన భారతీయ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ మహమ్మారి మరింతగా కుదేలు చేసింది. దీంతో అటు ప్రజలకు పూర్తి నష్టం కలగకుండా, అలాగే ఆర్థికంగా దేశానికి కొంచెం లాభం చేసే విధంగా మూడో విడత లాక్ డౌన్ లో సడలింపులు అందించారు. మరోవైపు అతిభయంకరమైన కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కుకు చేరువగా వుంది. ఇకపైనైనా కొత్త కేసుల నమోదును పూర్తిగా అదుపు చేసే విషయమై ప్రధాని నరేంద్రమోడీ పరిస్థితులను సమీక్షించారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ... కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ ఫార్మ కంపెనీలు ఏదశలో ఉన్నాయనే విషయమై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారీ ప్రక్రియకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్‌, డ్రగ్స్ తయారీ, చికిత్స, టెస్టింగ్ వంటి అంశాలపై ఆయా రంగంలో నిష్ణాతులైన వారితో మీటింగ్ పెట్టి మాట్లాడారు. అందరూ కలిసి వేగంగా, అత్యంత సమర్థమైన మందును తయారుచెయ్యాలని కోరారు. దేశంలో అన్ని శాస్త్రసాంకేతిక రంగాలు మరీ మఖ్యంగా కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ వంటి రంగాలన్నీ చేతులు కలిపి.. కరోనాపై యుద్దం చేస్తున్నాయని ప్రశంసించిన ప్రధాని.. అన్ని రంగాలూ పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తూ... వ్యాక్సిన్ తయారీ చేపట్టాలని కోరారు. ఈ రంగంలో ఇప్పటికే విజయాలు సాధించినవారు... మరింత లోతైన పరిశోధనలు చెయ్యాలన్నారు. సృజనాత్మకతతో సరికొత్త అవిష్కరణలు చేయడంలో భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ గొప్పదని కొనియాడారు.

మందులు, వ్యాక్సిన్ల తయారీ విషయంలో దేశీయ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్న ప్రధాని మోదీ... ఫార్మా రంగంలో స్టార్టప్స్ పెరగాలన్నారు. ప్రస్తుతం ఇండియాలో 30 రకాల కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ల తయారీ జరుగుతోంది. ట్రయల్స్ పూర్తైతేగానీ... ఏ వ్యాక్సిన్ కరోనాపై పూర్తిగా పనిచేయగలదో చెప్పలేం. టాబ్లెట్ల తయారీ విషయానికొస్తే... ప్రస్తుతం ఉన్న మందుల్లో నాలుగు మందులతో కరోనాను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే... కొత్త మందుల తయారీ పరీక్షలు కూడా చేస్తున్నారు. అలాగే... మొక్కలు, మూలికల ఔషధ గుణాల ద్వారా కరోనా నయం అవుతుందేమోనన్న అంశాన్ని కూడా పరిశీలించాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆగస్టు మాసంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి వాక్సీన్ తయారవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. క్రితం రోజు రాత్రి మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను తెలిపారు. రాష్ట్రంలోని ఎంతో అనుభవపూర్వకమైన ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కు వ్యాక్సీన్ ను తయారు చేసే పనుల్లోనే నిమగ్నమై వున్నారని తెలిపారు. బయోలాజికల్ ఇవాన్స్, శాంత బయోటెక్ కంపెనీలు ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వాక్సీన్ రూపోందిస్తామని తనతో జరిగిన సమావేశంలో చెప్పారని, ఇప్పటికే వాక్సీన్ రూపోందించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందని కూడా సీఎం కేసీఆర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles