Covid-19 cases in Andhra Pradesh reaches 1,800-mark ఆంధ్రప్రదేశ్ గడిచిన 24 గంటల్టో 60 కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus latest updates covid 19 cases in andhra pradesh reaches 1800 mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

As many as 60 have tested positive for COVID-19 in Andhra Pradesh in the last 24 hours, taking the state's coronavirus tally to 1,777 said the command control room on Wednesday.

ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కల్లోలం.. 24 గంటల్లో 60 పాజిటివ్ కేసులు

Posted: 05/06/2020 11:38 AM IST
Coronavirus latest updates covid 19 cases in andhra pradesh reaches 1800 mark

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ మాత్రం వ్యాప్తి చాటుకుంటూనే వుంది. గత కొద్దికాలంగా రాష్ట్రంలో ప్రతీ రోజు 60పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యయి, బుధవారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17 వేల మార్కు దాటింది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1777కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 34కు చేరడం కూడా అందోళన కలిగిస్తోంది. నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కర్నూలులో నమోదైంది. ఆ తరువాత కృష్ణా జిల్లాలు వున్నాయి. ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 729 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 17, గుంటూరులో 12 కేసులు, కృష్ణలో 14, విశాఖపట్నంలో రెండు, తూర్పుగోదావరిలో 1 కేసు నమోదయ్యాయని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1012 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 80 కరోనా కేసులు నమోదుకాగా, కేసులు నమోదు కాగా, 10 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 363 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 300 పాజిటివ్ కేసులు, పది మరణాలు సంభవించాయి. నెల్లూరు-92 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 61, పశ్చిమగోదావరి-59, చిత్తూరు-82, విశాఖపట్నం-39, కడప జిల్లాలో 90 కేసులు, అనంతపురం-80 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 46 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా ఐదు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles