Lockdown in Telangana extended till 29 May తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్: సీఎం కేసీఆర్

Covid 19 impact lockdown in telangana extended till 29 may

CM KCR, Lockdown Extended, containment Zones, Red zones in Telangana, Green zone in Telangana, Orange zone in Telangana, coronavirus, Indian Railways, Telangana, covid pandemic

Keeping the pandemic in view, the lockdown in Telangana has been extended till 29 May, announced chief minister K. Chandrasekhar Rao. "Public should complete purchase of essential items by 6 pm and they should reach their residences. There will be curfew in the state from 7 pm.

తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్: సీఎం కేసీఆర్

Posted: 05/05/2020 11:59 PM IST
Covid 19 impact lockdown in telangana extended till 29 may

కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో అకుంఠిత దీక్షతో చేసిన తపస్సుకు ఫలితం రావాలంటే మరికొన్ని రోజులు పాటు కఠిన నిబంధనలు అమలు చేయకతప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సమిష్టిగా సహకరించాలని ఆయన కోరారు. వైద్య నిఫుణులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు కేంద్ర అదేశాలను పాటిస్తూనే.. అంటువ్యాధుల నివారణ చట్టంలో స్పష్టం చేసిన మేరకు ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మే 7తో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఏడు గంటలకు పైగా కొనసాగిన క్యాబినెట్ బేటీ తరువాత ఆయన మంత్రులు ఈటెల రాజేందర్; హరీష్ రావు, సబితా ఇంద్రరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితర మంత్రులతో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా నియంత్రణకు మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని, భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువన ఓర్చుకుంటే కరోనాపై యుద్దంలో విజయం సాధించినవారం అవుతామని ఆయన అన్నారు,

కాగా ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు జిల్లాలు గ్రీన్ జోన్ లో వున్నాయని, ఈ నెల 11న ఆరెంజ్ జోన్ లో వున్న మరో 18 జిల్లాలు కూడా గ్రీన్ జోన్ లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ అర్భన్, గ్రేటర్ హైదరాబాద్ లు మాత్రం రెడ్ జోన్ల పరిధిలో వున్నాయని అన్నారు.

రెడ్ జోన్ లోని జిల్లాలో జనసాంద్రత అధికంగా వుందని.. బయటి దేశాలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పరిస్థితులు చూస్తే భయంకరంగా వుందని, అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రజల ప్రాణల పరిరక్షణకు పెద్దపీట వేస్తన్నామని అన్నారు. ఇక్కడి పరిస్థితులను కూడా మే 15వ తేదీ తరువాత మరోమారు క్యాబినెట్ బేటి అవుతుందని, అప్పుడు ఇక్కడ ఎలాంటి సడలింపులు ఇవ్వచ్చన్న విషయమై చర్చిస్తామని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 726 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇక మరణాలకు కూడా 29లో 25 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని కేసీఆర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles