Women in long queues at wine shops మద్యం దుకాణాల ముందు మగువల క్యూ.. గిల్లాసు గల్లుమనింది..

Liquor shops open women compete with men to purchase liquor in corporate centers

Liqour Shops, Lockdown, Women, Liquor Purchase, women purchase liquor, bengaluru, pune, corporate culture, software employees

In Bengaluru, a couple of images are going viral where it shows a separate line for women at a wine store in Kaggadaspura. Women are equally avid and enthusiastic about buying liquors as much as they are allowed to buy. With the fear of closing liquor shops again, people are forcing themselves to buy more.

మద్యం దుకాణాల ముందు మగువల క్యూ.. గిల్లాసు గల్లుమనింది..

Posted: 05/04/2020 06:57 PM IST
Liquor shops open women compete with men to purchase liquor in corporate centers

ఏంది బె ఎట్టాగ వుంది ఒళ్లు.. ఎక్కడో గుచ్చావు చాప ముళ్లు.. పాట గుర్తిందిగా సరిగ్గా అదే మాదిరిగా తయారైందా మండలం రోజుల తరువాత వ్యవహారాం అన్నట్లుగా వుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా తొలి విడత 21 రోజులు, మలి విడత 19 రోజుల పాటు ఏకంగా నలభై రోజులు (మండల కాలం) పాటు లాక్ డౌన్ కొనసాగి.. స్వల్ప సడలింపులతో ఇవాళ దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరిస్తున్నారన్న వార్త విన్న మందుబాబులు.. నిద్ర నుంచి లేచి లేవ్వంగానే ఏకంగా మంద్యం దుకాణాల ముందుకెళ్లి అక్కడి పళ్లు తోముకోవడం నుంచి పలు వ్యవహారాలు కానిచ్చేశారు.

తామంటే తాము ముందుగా మందు కొనుగోలు చేయాలని ఇలా చేశారులేండి. ఇది పక్కనబెట్టండీ ఉపోద్ఘాతానికి తరువాత కథకి ఏంటీ సంబంధం అంటారా..? ఇక ఉపోద్ఘాతం కంటిన్యూ యేషన్ విషయానికి వస్తే.. ఓసినీ ఇంకాస్త ముందుకెళ్లే.. సట్టిలో సురుకేదో నింపుకెళ్లు.. విస్కీ పట్టు ఇలా ఇలా.. సోడా కొట్టు అలా అలా.. ఎక్కేస్తే.. కిక్కిచ్చేలా.. హా.. హా.. ఏంది బే.. అంటూ సాగే పాట.. ఘరానా మొగుడు చిత్రంలో చిరంజీవి, నగ్మా నటించిన విషయం తెలిసిందే. అయితే అచ్చంగా ఇలానెనో లేక మరోలా ఏ దో ఘూంట్ ముజే భీ ఫిలాదే షరాభీ దేక్ ఫిక్ హోతా హై క్యా అని పాడుకునేందుకో తెలియదు కానీ మద్యం దుకాణాల ముందు మగువలు కూడా ఎలాంటి జంకు, బెణుకు లేకుండా క్యూలైన్లలో నిలబడ్డారు.

పురుషులతో పాటు ఒక్కటే లైన్లో నిలబడిన వారిని చూసి పోలీసులు వారి కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. అంతే ఇలా ఒకరు తరువాత ఒకరు. అలా మగవారితో పోటీ పడుతూ వారి క్యూ లైన్ కూడా పెరిగింది. ఇది ఏదో ఒక చోట అనుకుంటే ఫోరబాటే.. ఏ రాష్ట్రం చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని చోట్ల మధ్యం దుకాణాల వద్ద మగువలకు ప్రత్యేక క్యూ లైన్లు తప్ప అనేట్టు మారింది పరిస్థితి. అంతలా మగువలు కూడా మద్యానికి అలవాటు పడుతున్నారు. అయితే వీరిలో అధికంగా బెంగళూరు మద్యం దుకాణల.. అటు మహారాష్ట్రలోని ఐటీ కేంద్రమైన ఫూణేలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

పురుషులతో పాటు ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా మగువలు మద్యం కోసం వైన్ దుకాణాల ముందు క్యూ లైన్లలో నిలబడి మద్యం కొనుగోళ్లు చేశారు. అయితే అది వారి కోసమే, వారి భర్తల కోసమా.? లేక తండ్రులు కోసమా.? అన్న విషయాలు స్పష్టంగా తెలియకపోయినా.. కార్పోరేట్ కల్చర్ అధికంగా కనిపించే బెంగళూరు, ఫూణేలోని ఐటీ కేంద్రాల వద్ద మాత్రం ఈ తరహా చిత్రాలు కనిపించాయి. దీంతో సదరు యువతులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారని, అందుకనే వారు ఎలాంటి తత్తరపాటు లేకుండా ధైర్యంగా క్యూలైన్లలో నిలబడి మద్యం కొనుగోలు చేశారని పలువురు అంటున్నారు. ఏమైనా అల తానై అలరించేది మగువ, తనువు తానై మురిపించేది మగువ, ఒడి తానే మనిషినే మలిచేది మగువ.. నింగినైనా,, నేలనైనా అపూర్వమైనదీ మగువ.. ఎనలేని నిధి ఈ మగువ.. అని పాడిన కవిగారు ఈ చిత్రాలు చూస్తే ఏమని రాసేవారో.. మనం మాత్రం లేచింది.. నిద్రలేచింది..  అనక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles