migrant worker dies after cycling over 1,200kms మార్గమధ్యలో తుదిమజిలీకి చేరిన బహుదూరపు బాటసారి

Coronavirus indian migrant worker dies after cycling over 1 200kms

bihar labor died in lockdown, labors stranded in lockdown, migrant worker, Cycle Journey to Home, Dharamveer, Delhi to Bihar, Shahjahanpur, Members, khareta, Bihar, bareilly, Uttar Pradesh

Dharamveer, a migrant worker who had been cycling for over four days to cover 1,200kms, between the Indian capital Delhi and Bihar's Khagaria, collapsed and died. He was part of a group of seven people, who reached Uttar Pradesh’s Shahjahanpur district.

మార్గమధ్యలో తుదిమజిలీకి చేరిన బహుదూరపు బాటసారి

Posted: 05/04/2020 10:58 AM IST
Coronavirus indian migrant worker dies after cycling over 1 200kms

కూటికోసం కూలి కోసం పట్టణాలకు వలసవెళ్లిన బాటసారులకు లాక్‌డౌన్ కారణంగా ఎంతటి కష్టం వచ్చిందో అర్థమయ్యేలా పలు ఘటనలు సాక్షిభూతం వహిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు కొందరు తమ కాళ్లకు పనిచెబితే.. మరికొందరు మాత్రం ఇతర రవాణా మార్గాలు ఎంచుకుంటున్నారు. వీటిలో గాలి కూడా సరిగ్గా ఆడని కాంక్రీట్ మిక్సర్ లారీ ప్రయాణం చేస్తూన్న వారిని ఇటీవలే ఇండోర్ పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు తరలించారు. ఇలా అనేక మంది తమ స్వస్థలాలకు చేరకునేందుకు నానాయాతలు పడుతున్నారు.

ఇలా దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి బిహార్ లోని తన స్వగ్రామానికి బయలుదేరిన ఓ బాటసారి మార్గమధ్యంలోనే తుది మజిలీకి చేరుకున్నాడు. తాజాగా, బీహార్‌కు చెందిన ఓ యువకుడు ఢిల్లీ నుంచి సైకిల్‌పై బయలుదేరి గమ్యం చేరుకోకుండానే ప్రాణాలు విడిచాడు. బీహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన 28 ఏళ్ల ధర్మవీర్ కుమార్ ఢిల్లీలోని షాకూర్ బస్తీలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన ధర్మవీర్ ఢిల్లీ నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి సైకిలుపై వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరో ఆరుగురు స్నేహితులతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. అలా, 350 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని షాజహాన్‌పూర్‌కు చేరుకున్నాడు.

పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన వారంతా రాత్రి ఢిల్లీ-బరేలీ మార్గంలో ఉన్న ఓ టోల్‌ప్లాజా సమీపంలో నిద్రపోయారు. ఆ తర్వాతి రోజు అందరూ నిద్రలేచినా ధర్మవీర్ మాత్రం లేవలేదు. తట్టి లేపినా లేవకపోవడంతో అనుమానించిన స్నేహితులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్టు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. సుదీర్ఘంగా సైకిల్ తొక్కుతూ అలసిపోయి నీరసించడం వల్లే అతడు మరణించినట్టు పోస్టుమార్టంలో తేలింది. కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించగా నెగటివ్ వచ్చింది. యువకుడి మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles