setback for andhra pradesh government in High Court రాష్ట్ర హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ..

Setback for andhra pradesh government in high court

AP CM YS Jagan, Mines Department, Quarry bussines men, fines for illegal mining, mining act, High Court, Andhra Pradesh, Politics

Andhra Pradesh Government had experianced a major jolt in High Court as the apex court had kept the state mining department notices aside untill the lockdown is cleared and works in the quarries resume.

మైనింగ్ కేసులో.. రాష్ట్ర హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ..

Posted: 05/02/2020 05:28 PM IST
Setback for andhra pradesh government in high court

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో వైఎస్ జగన్ సర్కార్ కు మరోమారు చుక్కెరైంది, గతంలో ఇచ్చిన నోటీసులను కొట్టివేసిన తరువాత మరోమారు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై న్యాయస్థానం వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. లాక్ డౌన్ తో ఎక్కడి గనులు అక్కడే ఎలాంటి కార్యకలాపాలు లేని సమయంలో నోటీసులు పంపించి అపరాద రుసుమును కట్టాలని అదేశాలు జారీ చేయడంపై న్యాయస్థానం స్పందిస్తూ లాక్ డౌన్ ఎత్తివేత తరువాత ఈ నోటీసులపై అలోచిద్దామని చెప్పింది.

వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులకు రాష్ట్ర సర్కార్ అపరాద రుసుము చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసిన షాక్ ఇచ్చింది. అవి ఏకంగా రూ. 2,500 కోట్ల వరకు ఉండటంతో.. ఇంతమేర అపరాధ రుసుము తాము కట్టలేమంటూ,, ప్రభుత్వం గనులు, భూగర్భశాఖ గతంలో ఇచ్చిన నోటీసులను హైకోర్టు గతంలోనే గనుల వ్యాపారులు సవాల్ చేశారు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను న్యాయస్థానం ఇంతకు ముందే కొట్టేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో, ఓ క్వారీ యజమాని హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గతంలోనే ఒక తీర్పును వెలువరించామని... ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా గ్రానైట్ పరిశ్రమ మూతపడిన తరుణంలో జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడే ప్రభుత్వ నోటీసులకు క్వారీల నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత, గ్రానైట్ పరిశ్రమ గాడిలో పడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles