Migrant Workers Travelling In A Cement Mixing Truck దేవుడా.! కాంక్రీట్ మిక్స్ లారీలో వలసకూలీలు ప్రయాణం..

18 migrant workers found travelling in a cement mixing truck

Maharashtra, Madhya Pradesh, cement mixing truck, migrant workers, Lucknow, coronavirus, Government Guidelines, Covid Lockdown, Lockdown guidelines, Lockdown, containment Zones, Red Zones, No Transport,

18 migrant workers were found travelling in a cement mixing truck by the police in Indore, Madhya Pradesh. "They were travelling from Maharashtra to Lucknow. The truck has been sent to a police station & an FIR has been registered," says DSP Umakant Chaudhary

ITEMVIDEOS: ద్యేవుడా.! కాంక్రీట్ మిక్స్ లారీలో వలసకూలీలు ప్రయాణం..

Posted: 05/02/2020 04:43 PM IST
18 migrant workers found travelling in a cement mixing truck

కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను కబళించివేస్తోంది. ఇదే సమయంలో కరోనా సోకిందన్న వార్తలతో భయంతోనే పలువురు హడలిపోతున్నారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు రాలేక, వలస వెళ్లిన గ్రామాల్లో వుండలేక.. వలస కార్మికులు వేదన నిజంగా అరణ్య రోధనే. తమ స్వస్థలాలాను చేరుకునే గమ్యాలను వెతుకుతూ చివరకు గాలి కూడా ఆడని కాంక్రిట్ మిక్సర్ లారీలో ఎక్కి ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణించారు. చివరాఖరకు మార్గమధ్యంలో పోలీసులకు చిక్కి పరీక్షలకు హాజరయ్యారు.

బ‌స్సులు, రైళ్లు దాదాపు నెల రోజుల పైగా ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోవ‌డంతో తిండీతిప్ప‌లు లేక ఇబ్బందులు పడ్డారు. ప్ర‌భుత్వాలు షెల్ట‌ర్ హోమ్స్ పెట్టిన‌ప్ప‌టికీ.. చాలా మంది ఎలాగైనా సొంతూరికి చేరితే చాల‌న్న త‌ప‌న‌తో కాలిన‌డ‌క‌న ప్ర‌యాణ‌మ‌య్యారు. సొంత ఊరికి చేరితే తమవారితో వుండవచ్చు. తమవారి కష్టాలను తమవిగా చేసుకోవచ్చు. కష్టాలెన్ని చుట్టుముట్టినా తమవారికి అండగా వుండవచ్చు. ధైర్యంగా నాలుగు మంచి మాటలతో వారిలనూ ధైర్యాన్ని నిలపవచ్చు. ఒక‌పూట తిన్నా తిన‌క‌పోయినా.. చావో రేవో.. తమవారి వద్దే తేలుసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో మరికోందరు దొంగచాటుగా లారీలు, ట్ర‌క్కుల్లో దాక్కుని దాక్కుని వెళ్లారు. అయితే ఇలా కష్టపడుతున్న వలస కూలీల కోసం కేంద్రం పలు రవాణా సదుపాయాలను కల్పించింది. అయితే ఈ విషయం తెలియని కొందరు వలస కూలీలు తమకు తెలిసిన మార్గాల్లో దొంగచాటుగా సరిహద్దులు దాటుకుంటూ వెళ్లారు. అయిత వీరిలో కొందరిని మాత్రం పోలీసులు అడ్డుకుని క్వారంటైన్ కు తరలించారు. ఎందుకంటే వీరు పోలీసులకు మార్గమధ్యంలో పట్టబడ్డారు కాబట్టి. తమలాంటి వారికోసం శ్రామిక్ స్పెష‌ల్ రైళ్ల నడుస్తున్నాయన్న విషయం కూడా వీరికి తెలియదు.

అయితే ఈ వలస జీవులకు ఈ విజయం తెలియకపోవడంతో వారు గాలీ కూడా అంతంత మాత్రంగానే అడే కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంక‌ర్ లారీలో సొంతూరికి వెళ్లే సాహసం చేశారు. 18 మంది వ‌ల‌స కూలీలు మ‌హారాష్ట్ర నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌క్నో వెళ్తుండ‌గా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ ద‌గ్గ‌ర పోలీసులు ఆపారు. ట్యాంక‌ర్ చెక్ చేస్తే లోప‌ల మ‌నుషులు ఉండ‌డం చూసి షాక‌య్యారు. గాలి కూడా స‌రిగా ఆడుతుండో లేదో తెలియ‌ని ఆ ట్ర‌క్ లో 18 మంది ప్ర‌యాణం చేయ‌డ‌మంటే ప్రాణాల‌కు తెగించి వెళ్ల‌డ‌మేన‌ని చెప్పాలి. ట్ర‌క్ ను స్వాధీనం చేసుకుని, ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని చెప్పారు డీఎస్పీ ఉమాకాంత్ చౌద‌రి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Madhya Pradesh  cement mixing truck  migrant workers  Lucknow  No Transport  Red Zones  

Other Articles