CM KCR hoisted flag on 20th TRS party anniversary పార్టీ 20వ అవిర్భావం.. తొలిసారి నిరాడంబరంగా వేడుకలు

Cm kcr greets party workers people on 20th trs party anniversary

Telangana CM, KCR, Telangana Rashtra samiti, Telangana Ruling party Foundation day, TRS foundation day, coronavirus, covid-19, Telangana

Telangana Chief Minister, founder of Telangana Rashtra Samiti party Kalvakuntla Chandrashekar Rao conveyed greetings to the party workers and people of Telangana on the occasion of 20th anniversary of TRS party. CM KCR said that TRS party achieved many historical victories from its inception.

నిరాడంబరంగా పార్టీ 20వ అవిర్భావ వేడుకలు.. జెండా అవిష్కరించిన కేసీఆర్

Posted: 04/27/2020 11:04 AM IST
Cm kcr greets party workers people on 20th trs party anniversary

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ 20వ వసంతంలోకి అడుగు పెట్టింది. తొలిదశలో ప్రాణార్పణలు, ఆత్మార్ఫణలు చేసినా.. సాధ్యం కానీ తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన క్రెడిల్ టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దే. మలిదశ ఉద్యమంలో ఉద్యమనేత.. కూడళ్లకు పరిమితమైన ఉద్యమాన్ని నలుదిశలా వ్యాప్తి చెందేలా చేసిన నేత ఆయన. గ్రామీణ ప్రాంతాల్లోని హోటళ్లు, రచ్చబండల నుంచి వంటింట్లోని పోయ్యిల వద్దకు, కొతలు కోసే కోడవళ్లు చేతబట్టిన మహిళామణుల వద్దకు చేర్చింది కూడా ఆయనే.

ఒక నేతగా ఆయన ఓ వైపు ఉద్యమాన్ని, ఉద్యమ కార్యచరణను రూపొందిస్తూనే.. మరోవైపు ఉద్యమంలో పాటలు బాగా ప్రజలను తేజోవంతుల్ని చేస్తాయని, ప్రత్యేక పాటలను కూడా రచించి ఉద్యమాని నూతన ఒరవడిలో నడిపించి.. విజయదీరాలకు చేర్చిన ఘనత కూడా కేసీఆర్ దే. కాగా, 20వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా.. లాక్ డౌన్ అమల్లో వున్న నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు చేరుకొన్న సీఎం కేసీఆర్.. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. మరోవైపు ముఖానికి మాస్క్ కట్టుకుని వచ్చారు. పార్టీ వార్షికోత్సవ వేడుకలను కూడా నిరాడంబరంగానే జరపుకున్నారు.

ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తరువాత తెలంగాణ పితామహుడైన ఫ్రోఫెసర్ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు మాత్రమే హాజరైన ఈ పార్టీ పతాకాన్ని ఆవిష్కరరణ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన సామాజిక దూరం పాటిస్తూ.. తొటి పార్టీ నేతలందరూ మాస్క్ లు ధరింపజేసి.. ఆయన కూడా మాస్క వేసుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు కేటీఆర్‌, ఈటలతో పాటు కేకే తదితర ముఖ్య నేతలంతా మాస్కులు ధరించి పాల్గొన్నారు.

2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన తెరాస ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలతో అనేక విజయాపజయాలు, ఒడుదొడుకులు ఎదుర్కొని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినా కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నిరాడంబరంగా జరపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలంతా ఎవరి ఇంటిపై వారు పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. వారం రోజుల పాటు రక్తదానం చేయాలని దిశానిర్దేశం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles