Tension in Sattenapalli after Youth dies of 'police beating' లాఠీ దెబ్బకు అగిన గుండె.. గుంటూరు సత్తెనపల్లిలో టెన్షన్ టెన్షన..

Covid 19 lockdown tension in sattenapalli after youth dies of police beating

Mohammad ghouse, Young man, heart attack, police beaten to death, coronavirus, covid-19, Lockdown, sattenapalli, guntur, Guntur Police, Guntur police brutality, Sattenapalli , Sattenapalli tension, Coronavirus, COVID 19, Guntur lockdown, Sattenapalli Muslim man, Andhra Pradesh, Crime

A young man died allegedly after beaten up by police for coming out of `non-emergency' work during lockdown leading to tension in Sattenapalli town in Guntur district. Police said that the deceased was suffering from a chronic heart ailment and denied that the victim was beaten by them.

కరోనా లాక్ డౌన్: లాఠీ దెబ్బకు అగిన గుండె.. గుంటూరు సత్తెనపల్లిలో టెన్షన్ టెన్షన..

Posted: 04/20/2020 01:41 PM IST
Covid 19 lockdown tension in sattenapalli after youth dies of police beating

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించాడని ఓ యువకుడిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. లాఠీ దెబ్బకు ఓ యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కాగా, పోలీసుల మాత్రం యువకుడి మరణంలో తమ ప్రమేయం ఏమీ లేదని వాదిస్తున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన యువకుడి వాహనాన్ని తనిఖీల నిమిత్ం అపిన వెంటనే అతనికి చమటలు పట్టి తీవ్ర గుండెపోటుతో మరణించాడని తలిపారు.

స్థానిక ఆరో వార్డుకు చెందిన షేక్‌ మహ్మద్‌ గౌస్‌(33) అనే యువకుడు తన తండ్రి ఆదామ్‌ ఇంట్లో ఉన్న ఔషధాలకు సంబంధించిన స్లిప్పులను తీసుకొని వస్తుండగా నర్సారావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద పట్టణ ఎస్సై రమేశ్‌ ఆపారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నావని యువకుడిని ప్రశ్నించగా.. తన తండ్రి ఇంటికి వెళ్లి వస్తున్నానని గౌస్‌ సమాధానం చెప్పాడు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చాడని భావించిన ఎస్సై లాఠీతో గౌస్‌ వీపుపై కొట్టగా.. అతను అక్కడే కుప్పకూలి కింద పడిపోయాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీంతో పోలీసులు నిచేష్టులయ్యారు.

వెంటనే మృతుడి కుటుంబసభ్యులకు విషయాన్ని ఫోన్‌ ద్వారా తెలియజెప్పారు, దీంతో బాధితుడి కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని గౌస్ ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గౌస్‌ మృతి చెందాడు. గౌస్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని.. పదకొండు సంవత్సరాల క్రితం ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించినట్లు మృతుడి తండ్రి ఆదామ్‌ తెలిపారు. అయితే పోలీసుల లాఠీ దెబ్బ కొడుతున్నారన్న భయంతో అతని గుండె అగిపోయిందని అవేదన వ్యక్తం చేశారు. తమ తనయుడి మృతికి ఎస్సై రమేష్ దే బాధ్యతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

లాఠీ దెబ్బ కొట్టిన ఎస్సైపై సస్పెన్షన్ వేటు:

సత్తెనపల్లిలో స్థానిక ఎస్ఐ లాఠీ దెబ్బకు గుండె అగి ఒక యువకుడు మరణించిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పోలీసులు కొట్టడం వల్లే  షేక్‌ గౌస్‌ అనే వ్యక్తి మృతి చెందాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపించడంతో., రంగంలోకి దిగిన ఉన్నాతాధికారులు వెనువెంటనే బాధ్యుడైన ఎస్ఐపై చర్యలకు ఉపక్రమించారు. రమేష్ ను విధుల నుంచి సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఐజీ ప్రభాకర్‌రావు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్‌ను ఆపేందుకు ఎస్సై రమేశ్‌ ప్రయత్నించారని ఐజీ చెప్పారు.

అప్పటికే అతడికి చెమటలు పట్టి కిందపడిపోయాడని వివరించారు. వెంటనే సమీపంలోని ఆస్ప్రతికి తరలించారని.. అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. ఎస్సై రమేశ్‌బాబును సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. ఇలాంటి విషయాల్లో పోలీసు సిబ్బందికి తరచుగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే చాలామందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. లాక్‌డౌన్‌ వేళ సరైన ఆధారాలతోనే బయటకు రావాలని ప్రజలను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles