The Wuhan lab at the core of a coronavirus controversy వూహాన్ ల్యాబ్ లో పుట్టిన కరోనా లీక్.. ఫాక్స్ న్యూస్ కథనం

Covid 19 virus accidentally leaked by an intern at wuhan lab suggests us media

coronavirus, Wuhan,US,wet market, bats, Donald Trump, Republicans, China, WHO, COVID-19, bioweapon, Wuhan Institute of Virology in China, coronavirus cases, COVID-19 pandemic, corona virus India, coronavirus updates, coronavirus breakout, coronavirus spread, Crime

The Fox News in an exclusive report based on unnamed sources has claimed that though the virus is a naturally occurring strain among bats and not a bioweapon, but it was being studied in Wuhan laboratory. The initial transmission of the virus was bat-to-human, the news channel said, adding that the "patient zero" worked at the laboratory.

వూహాన్ ల్యాబ్ లో పుట్టిన కరోనా లీక్.. ఫాక్స్ న్యూస్ కథనం

Posted: 04/18/2020 11:34 AM IST
Covid 19 virus accidentally leaked by an intern at wuhan lab suggests us media

కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఈ రాకాసి పోతుందని ఎదురు చూస్తున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టివేసింది. లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ చైనాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన వూహాన్ నుంచే ఈ వైరస్ విస్తరించిందనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎలా బయటకు వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. చైనా ఉద్దేశ్యపూర్వకంగా బయటకు వైరస్ వదిలిందని అమెరికా ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. చైనా వైరస్ అని సంభోదించడం కలకలం రేపింది. ఈ  క్రమంలో ఫాక్స్ న్యూస్ ఓ సంచలన కథనం హల్ చల్ చేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి బయటకొచ్చిందని, అప్పటి నుంచి వైరస్ ప్రస్తానం మొదలైందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇనిస్టిట్యూట్ వైరాలజీలో కరోనా లాంటి ఎన్నో వైరస్ లపై ప్రయోగాలు చేస్తుంటారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఈ స్టడీలో పాలు పంచుకున్న ఓ స్టూడెంట్ చేసిన చిన్న పొరపాటుతో ఈ కరోనా వైరస్ ఆమెకు సోకిందంట.

ఈ విద్యార్థిని ప్రియుడు.. ఇనిస్టిట్యూట్ సమీపంలో ఉన్న  మాంసం కొనుగోలు చేయడం..ఇతని నుంచి వైరస్ ఇతరులకు వేగంగా సోకిందని కథనం. దీనిపై వివరాలు సేకరిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. ప్రస్తుతం ఎంతో మంది మరణించడానికి కారణమైన ఈ వైరస్ వ్యాపించడానికి చైనాయే కారణమని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్ లపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఫాక్స్ న్యూస్ కథనం కలకలం రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID-19 pandemic  coronavirus  lockdown  Wuhan  US  wet market  bats  China  WHO  bioweapon  Wuhan Institute of Virology  China  

Other Articles