WHO rubbishes social media rumour on cabbage as fake క్యాబేజీపై ఆ వదంతులను నమ్మకండీ.. బేకరీ ఫుడ్స్ పైనా..

Does cabbage carry the coronavirus for a longer time

Coivd-19, coronavirus outbreak, Coronavirus, Covid-19 cabbage, Lockdown, coronavirus lockdown, Eating Restrictions, WHO, World Health Organiation, Press Information Bureau, Jaani, foodborne illness, coronavirus, Cabbage, National Politics

A message is doing the rounds warning people to not eat cabbage. It states that ‘according to a WHO report, the coronavirus remains the longest inside a cabbage. While on other surfaces it remains for 9-12 hours, in a cabbage, it can stay for 30 hours. All citizens are requested to avoid consuming cabbage.

కరోనా వైరస్: క్యాబేజీపై ఆ వదంతులను నమ్మకండీ.. బేకరీ ఫుడ్స్ పైనా..

Posted: 04/16/2020 11:36 AM IST
Does cabbage carry the coronavirus for a longer time

కరోనా వైరస్ ఏమో గాని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూపిస్తుంది సోషల్ మీడియా. పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా క్యాబేజీ తింటే కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా చేసారు. క్యాబేజీ ఆకులపై కరోనా వైరస్ గంటల తరబడి బ్రతుకుతుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని ప్రపంచ అరోగ్య సంస్థ వెల్లడించినట్ుట కలరింగ్ కూడా అద్దుతున్నారు. దీంతో క్యాబేజీ రైతులు లబోదిబోమంటున్నారు.

దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఇందులో నిజం లేదని స్పష్టంగా చెప్పింది. ప్రెస్ ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఇండియన్ న్యూస్ (PIB) దీనిపై కథనం రాసింది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు స్పష్టంగా సూచనలు చేసింది. ప్రజలు అసలు ఆందోళన చెందవద్దు అని పేర్కొంది. క్యాబేజీలో మాత్రమే కరోనా గంటల పాటు ఉంటుందని వదంతులో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించింది. కరోనా నేపత్యంలో అన్ని కూరగాయలను వేడి నీళ్లలో కడిగి వాడాలని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ సూచించింది.

మిగతా కూరగాయల మాదిరిగానే క్యాబేజీని కూడా వేడి నీటిలో కడగాలని సూచించిన డబ్యూహెచ్ఓ.. ఆ తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలని… ఆ తర్వాత క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసుకొని, బాగా ఉడికించుకోవాలని సూచిస్తున్నారు. సగం ఉడికిన క్యాబేజీని తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల రైతులు ఇలాంటి తప్పుడు ప్రచారాల కారణంగా భారీగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు మరింత మంది రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

బేకరీ ఉత్పత్తుల వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందా?: బేకరీ ఉత్పత్తులపై కూడా తాజాగా మరో మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బేకరి ఉత్పత్తులను తింటే కరోనా వ్యాధి సంక్రమిస్తుందన్న మెసేజ్ కూడా వైరల్ అవుతోంది.  ఇ:దుకు కారణం కూడా ఉంది. జంక్ ఫుడ్ ను కడిగేందుకు వీలుగా ఉండవనీ, వాటిపై కరోనా వైరస్ ఉంటుందనీ... అందువల్ల వాటిని తినవద్దని డబ్యూహెచ్ఓ చెప్పినట్లు మరో మెసేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి డబ్యూహెచ్ఓ అలా ఎక్కడా చెప్పలేదు. బేకరీ ఉత్పత్తుల వల్ల కరోనా వైరస్ ఈజీగా వ్యాపిస్తుందనేందుకు ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles