దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలో పది వేల కరోనా వైరస్ కేసుల సంఖ్య 10 వేల మార్కు దాటింది. దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ గత 24 గంటల్లో వెయి మందికి పైగా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో దాదాపు 700 కేసులు ఢిల్లీ, మహారాష్ట్రలోనే నిర్థారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 339మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం బాధితుల్లో 1036మంది కోలుకోగా ప్రస్తుతం మరో 8988మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. దేశంలో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చేందుతున్న తరుణంలో ప్రధాని ఇప్పటికే వచ్చే నెల 3వ తేదీ వరకు పోడగించారు. అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారిని ఇప్పటికే దేశవ్యాప్తంగా 10,363 మందిని కబళించి వేసింది. ఇక దీని బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య 339కు చేరింది. ఇక ఈ వ్యాధి బారిన పడి కొలుకుంటున్న వారి సంఖ్య 8988కు చేరుకుంది.
దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 160కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 349పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2334కి చేరింది. దేశఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. హజ్రత్ నిజాముద్దీన్ ఘటన అనంతరం దేశ రాజధాని దిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక్కరోజే 356 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో కేసుల సంఖ్య 1510కి చేరింది.
రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తమిళనాడులోనూ కొవిడ్-19 తీవ్రత కొనసాగుతోంది. మర్కజ్ సమావేశం అనంతరం రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీస్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1173కి చేరగా 11మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్‌తో మరణించే వారిసంఖ్య మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 43మంది చనిపోగా, గుజరాత్‌లో 26మంది బలయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more