భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన వచ్చింది. దేశప్రజలంతా ఒక్కటిగా మారి తాము ఐక్యంగా కరోనా రక్కసితో పోరాడేందుకు సిద్దమని చాటిచెప్పారు. పలువురు దీపాలను వెలిగించి ఆ తరువాత చప్పట్లనుకూడా కొట్టారు. అయితే దీపాల కాంతిని చూసిన అత్యుత్సాహంలో ఓ బీజేపి మహిళా నాయకురాలు ఏకంగా ఓ వింత కార్యానికి శ్రీకారం చుట్టారు.
దెవ్వలెలను వెలగించడంతో పాటు భిన్నంగా ఆలోచించిన ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్ మంజూ తివారీ.. మరో అడుగు ముందుకేసీ తుపాకీ కాల్చారు. ఈమె చూపించిన అత్యుత్సాహానికి ఉత్తరప్రదేశ్ పోలీస్ ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె చేసిన తప్పును ఆమే #9pm9minute అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా పోస్టు చేసుకుని బుక్కయింది. ఆమె గాల్లోకి కాల్పులు జరుపుతుంటే సపోర్ట్ చేస్తూ భర్తే వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. 'దీపాలు వెలిగించాం. ఇప్పుడు కరోనాను తరుముతున్నాం' అంటూ కామెంట్ కూడా రాశారు.
कानून तोड़ने में सबसे ज्यादा आगे भाजपा नेता ही रहते हैं। कल पीएम की अपील थी दिया जलाने की लेकिन देखिए कैसे भाजपा नेता व बलरामपुर भाजपा महिला मोर्चा की अध्यक्ष ने खुलेआम प्रदर्शन के लिए फायरिंग की और वीडियो फेसबुक पर डाला।
— UP Congress (@INCUttarPradesh) April 6, 2020
योगी आदित्यनाथ इस पर कार्यवाही करेंगे क्या? pic.twitter.com/W9IioUsYXh
(And get your daily news straight to your inbox)
Feb 25 | అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్... Read more
Feb 25 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో... Read more
Feb 25 | పోలీసులకు మూడు రోజుల పాటు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఘట్ కేసర్ బీ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన కేసును చేధిస్తున్న రాచకోండ పోలీసులకు అమె కేసు దర్యాప్తులో సంచలన విషయాలు తెలుస్తున్నాయి.... Read more
Feb 25 | ఒక ప్రాణాన్ని తీయడం ఎంతో కష్టం.. ఇక ప్రాణం పోయడం మాత్రం మానవమాత్రులకు సాధ్యం కానిదే. కానీ ప్రాణాన్ని నిలపడం మాత్రం మనుషులకు సాధ్యమైన పనే. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలుగా వున్నవారి నుంచి తాము... Read more
Feb 25 | చైన్ స్నాచర్లు, మొబైల్ స్మార్ట్ఫోన్ స్నాచర్లు రోజురోజుకీ పెరుగిపోతున్నారు. మహిళలను, వయస్సుపైబడిన మధ్యవయస్కులతో పాటు వృద్దులను టార్గెట్ చేసే దొంగలు వారి మెడలోంచి తమ చైన్లను, సెల్ ఫోన్లను లాక్కుని పారిపోతుంటారు. ఇలాంటే ఘటనలను... Read more