Tamil Nadu Records 110 New Coronavirus Cases తమిళనాడులో ఒక్కరోజునే 110 కరోనా కేసులు..

Covid 19 110 new cases from delhi tablighi jamaat event in tamil nadu

Coronavirus Tamil Nadu, coronavirus death, Nizamuddin markaz, Muslims quarantine, coronavirus tests, chennai, Tamil nadu coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news, Extend Night Curfew, Coronavirus, Coronavirus Effect Night Curfew Extended, Coronavirus Night Curfew Extended Till April 14, Latest Telangana News

Tamil Nadu’s tally of confirmed coronavirus cases crossed the 200-mark on Wednesday. With 110 more persons who attended the Tablighi Jamaat conference at Nizamuddin in Delhi testing positive for COVID-19 in 15 districts, the total number of cases in the State increased to 234.

తమిళనాడులో ఒక్కరోజునే 110 కరోనా కేసులు.. అధికశాతం వారే

Posted: 04/01/2020 06:20 PM IST
Covid 19 110 new cases from delhi tablighi jamaat event in tamil nadu

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వార్తలు వింటూనే ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాధి రాష్ట్రమైన తమిళనాడులో పెరుగుతున్న కరోనా కేసులు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో ఆకస్మికంగా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే ముందు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కజ్ బిల్డింగ్ లో జరిగిన మతపరమైన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

అయితే 22న జనతా కర్ప్యూ విధించిన ప్రధాని ఆ వెంటనే 23న మరోమారు ప్రజల ముందుకు వచ్చి కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మార్చి 24 న లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ ను ఎంతో కఠినంగా అమలుచేశారు. బయటకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు కూడా జుళిపించారు. దీంతో సత్ఫాలితాలు వస్తున్నాయని ఆశిస్తున్న సమయంలో కొత్త కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు అలర్ట్ అయ్యాయి. ఈ కొత్త కేసులన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు కావడంతో దీనిపై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించింది.

తమిళనాడులో ఈ ఒక్కరోజులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో తూత్తుకుడి, తిరునెవేలి, శివగంగ, మధురై, కోయంబత్తూరు, తేని, దిండిగుల్ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ 110 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే కావడంతో పళనిస్వామి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి వివరాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించి.. అందరినీ ఆస్పత్రులకు తరలిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులను కూడా క్వారంటైన్ సెంటర్లకు చేరుస్తున్నారు. వీరికి పరీక్షలను నిర్వహించిన తరువాతే.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో వుంటామన్న పూచికత్తుపైనే ఇళ్లకు పంపిస్తామని చెబుతున్నారు.

తమిళనాడు నుంచి ఢిల్లీకి 1130 మంది వెళ్లగా, తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు 515 మందిని గుర్తించింది. మిగతా వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు నమోదైన 110 కొత్త కేసులతో కలిపి తమిళనాడులో మొత్తం 234 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నమోదైన 43 కొత్త కేసులు కూడా ఢిల్లీ నుంచి వచ్చినవే. దేశరాజధానిలో కూడా కరోనా కేసుల సంఖ్య ఒక్కరోజులో గణనీయంగా పెరిగింది. బుధవారం(ఏప్రిల్-1,2020) ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 152కి చేరింది. గడిచిన 24గంట్లలోనే 32మందకి కరోనా వచ్చినట్లు నిర్థారణ అయింది. అయితే ఇందులో 53మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles