No money, Italians raid supermarkets డబ్బులు లేక.. ఇటలీలో సూపర్ మార్కెట్ల లూటీ!

Italy risks losing grip in south with fear of looting riots

coronavirus, covid-19, italy lockdown, coronavirus italy, super markets loot, super markers riots, italy, coronavirus out break, italy police, law and order

Police with batons and guns have moved in to protect supermarkets on the Italian island of Sicily after reports of looting by locals who could no longer afford food. The death toll from the coronavirus outbreak in Italy climbed by 756 to 10,779, the Civil Protection Agency said

కరోనా వైరస్: డబ్బులు లేక.. ఆకలితో ఉండలేక.. ఇటలీలో సూపర్ మార్కెట్ల లూటీ!

Posted: 03/30/2020 08:08 PM IST
Italy risks losing grip in south with fear of looting riots

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువ అవుతోంది. కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా గుప్పిట్లో యూరప్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. మొత్తం మరణాల్లో సగం ఇటలీ, స్పెయిన్ దేశాలలోనే నమోదు కావడం ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. నిజానికి బాధితుల సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్క ఇటలీలోనే సుమారు పది వేల మందికి పైగా కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు.

మరోవైపు, ఇటలీ ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎంతో అభివృద్ది చెందిన దేశంలో ప్రజలు ప్రస్తుతం తిండిలేక అలమటిస్తున్నారు. ప్రజల వద్ద డబ్బులు లేక..  ఏం చేయాలో తెలియని పరిస్థితులకు దిగజారి దోంగతనాలు, దోపిడీలకు సైతం పాల్పడుతున్నారు. ఓ వైపు లాక్ డౌన్, మరోవైపు ఆకలి మంటల నేపథ్యంలో జనం తిండిలేక సూపర్ మార్కెట్లను లూటీ చేస్తున్నారు. ప్రజలు సూపర్ మార్కెట్లలోకి చోచ్చుకెళ్లి తమకు అందినకాడికి అందిన వస్తువులను దోచుకెళ్తున్నారు. ప్రజలు ఒక్కసారిగా దోపిడీలకు తెరలేపడంతో ఇటలీలో సూపర్ మార్కెట్ దారులు విపరీతంగా నష్టపోతున్నారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. కరోనాతో మృతి చెందినవారి సంఖ్య ఇటలీలో పదివేలు దాటిపోయింది. మృతులను పూడ్చిపెట్టేందుకు శవపేటికలు కూడా దొరకని దుర్భర పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పడంతో తమను ఆదుకోవాలంటూ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ సహా మరో ఆరు దేశాలు యూరోపియన్ యూనియన్‌ను వేడుకున్నాయి. స్పెయిన్‌లోనూ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ ఒక్క రోజులోనే 838 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,528కి చేరుకుంది. 78,797 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles