Telangana reports first Coronavirus death తెలంగాణలో తొలి కరోనా మరణం... కొత్తగా పెరిగిన కేసులు

Coronavirus first covid 19 death in telangana cases climb to 67

Coronavirus In India,coronavirus updates, telangana corona death,corona death in telangana,first corona death in telangana,corona news from telangana,Etela rajendar pressmeet,corona death, Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Telangana registered its first coronavirus (COVID-19) death on Saturday after a 74-year-old man with travel history to Delhi died at a private hospital.

తెలంగాణలో తొలి కరోనా మరణం... కొత్తగా పెరిగిన కేసులు

Posted: 03/28/2020 06:06 PM IST
Coronavirus first covid 19 death in telangana cases climb to 67

తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో వుండగా, ఒక్కరోజులో పది పాజిటివ్ కేసులు నమోదైన క్రమంలో ఇది అందోళన కలిగించే అంశమని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన 24 గంటల వ్యవధిలోనే తెలంగాణలో తొలి మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ వ్యక్తి ఒకరు చనిపోయారు. అయితే, అతడు చనిపోయిన తర్వాత అతడి రిపోర్టులు వచ్చాయని, అందులో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు ఆయన తెలిపారు.

ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చనిపోయాడని, అయితే, ఆయన మరణించిన తర్వాత రిపోర్టులు వచ్చాయని, అయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఇక తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఈటల రాజేందర్ తెలిపారు. ఈనెల 27 వరకు 59 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉండగా, ఈరోజు కొత్తగా మరో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 65కు పెరిగింది.

పాతబస్తీకి చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చిందని, అలాగే, కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ కుటుంబంలో నలుగురికి కరోనా సోకిందని ఈటల రాజేందర్ తెలిపారు. నాలుగు కుటుంబాల్లో ఎక్కువ కేసులు నమోదైనట్టు ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ, ఖైరతాబాద్ చింతల్ బస్తీ, కుత్బుల్లాపూర్, నాంపల్లికి చెందిన నాలుగు కుటుంబాలకు కరోనా వ్యాపించింది. విమానాశ్రయంలో పనిచేస్తున్న కొందరికి కూడా కరోనా వచ్చినట్టు మంత్రి తెలిపారు.

ఇక హైదరాబాద్‌లో రెడ్ జోన్లు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈటల ఖండించారు. ఎక్కడ కూడా రెడ్ జోన్లు లాంటివి లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. ప్రజలు ప్రార్థనల కోసం కూడా బయటకు రావొద్దని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మసీదులకు రావొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles