Four people test positive for COVID-19 in Telangana తెలంగాణలో 45కు చేరిన కరోనా కేసులు..

A doctor and his wife tested positive taking the total coronavirus cases to 45 in telangana

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Telangana reported four new cases of Coronavirus in the state, taking the total number of cases in the state to 45. This includes a doctor and his wife who doesn't have travel history o foreign countries.

తెలంగాణలో 45కు చేరిన కరోనా కేసులు..

Posted: 03/27/2020 10:04 AM IST
A doctor and his wife tested positive taking the total coronavirus cases to 45 in telangana

తెలంగాణలో మరో నలుగురికి కరోనా సోకింది. వీరందిరికీ రెండో దశలో కరోనా వ్యాధి సోకింది. వీరు ఇటీవల కాలంలో విదేశీ ప్రయాణం చేయలేదని, కాగా ఢిల్లీ, తిరుపతి వెళ్లొచ్చిన తర్వాత వీరిలో ఈ లక్షణాలు కనిపించినట్టు వైద్యాధికారులు తెలిపారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం రోగుల సంఖ్య 45కు చేరుకుంది. తాజాగా సోకిన నలుగురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నలుగురితో ఇప్పటి వరకు సన్నిహితంగా ఉన్న వారిని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో నమోదైన 45 కేసుల్లోనూ విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే ఉన్నారు.

తాజాగా, నమోదైన నలుగురిలో ఒకరు మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ వ్యక్తి. ఈ నెల 14న రైలులో ఢిల్లీ వెళ్లి 18న సికింద్రాబాద్ చేరుకున్నాడు. మరో రెండు కేసుల్లో వైద్యుడు, ఆయన భార్య ఉన్నారు. 14 నుంచి 16 వరకు సెలవులో ఉన్న వీరిద్దరూ 17న విమానంలో తిరుపతి వెళ్లి మళ్లీ అదే రోజు తిరిగొచ్చారు. 18, 19 తేదీల్లో ఇంటి పట్టునే ఉన్నారు. 24న వీరు పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. చివరి వ్యక్తి బుద్ధనగర్ వాసి. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే కరోనా సోకినట్టు తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles