beer case robbed from beer lorry in Telangana బీర్ల లారీ నుంచి 120 కేసుల బీర్లు చోరీ!

Beer case robbed from beer lorry at devarayamjal in telangana

Devaraymajal, Sharmirpet mandal, Medchal district, Telangana Excise depo, Lockdown, Kingfisher beer, cotton of beer theft, Coronavirus, Covid-19

A beer lorry from King Fisher company loaded with cottons of beer had been at stand at devarayamjal of Medchal district in Telangana was been robbed due to Telangana Lockdown

అమ్మో మద్యం దొంగలు: బీర్ల లారీ నుంచి 120 కేసుల బీర్లు చోరీ!

Posted: 03/26/2020 10:04 AM IST
Beer case robbed from beer lorry at devarayamjal in telangana

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ భయం వెన్నాడుతున్న వేళ, చోరులు మాత్రం ఎక్కడ దొంగతనం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ తమ తమ ఇళ్లలో వుంటున్న వేళ.. చోరులు మాత్రం తమ బుర్రకు పనిచెబితున్నారు. నిత్యం కల్యాణం.. పచ్చ తోరణం అన్నట్లు అనునిత్యం కళకళలాడే మందు దుకాణాలు.. ఇప్పుడు మూతపడ్డాయి. ఇక దీనికి తోడు మందుబాబుల బాధ వర్ణణాతీతం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మద్యం డిపో నుంచి ఏకంగా 120 కేసుల బీర్ మాయమయ్యింది.

ఈ ఘటన దేవరయాంజల్ పరిధిలోని డిపో-1 వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే, మల్లేపల్లి నుంచి దేవరయాంజల్ కు ఏపీ 27 డబ్ల్యూ 7758 నంబర్ గల లారీలో కింగ్ ఫిషర్ లోడ్ వచ్చింది. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా దీన్ని అన్ లోడ్ చేయలేదు. విషయం తెలుసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు, ప్రహరీ గోడకు రాళ్లను పెట్టి గోడౌన్ లోకి దిగి, లారీ టార్పాలిన్, తాళ్లను కత్తిరించి, బీర్లను ఎత్తుకెళ్లారు. నిన్న ఈ విషయాన్ని గమనించిన లారీ డ్రైవర్, డిపో మేనేజర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలన్నీ బంద్ కావడంతో గత పది రోజులుగా మద్యం దుకాణాలు మూడపడటంతో పిచ్చెక్కిపోయిన మందుబాబులే ఈ పనికి పాల్పడ్డారా.? లేక ఇది చోరుల పనా.? లేక మద్యం దుకాణాల లైసెన్సుదారుల పనా.? లేక ఇంటి దొంగల పనేనా అన్నది తెలియాల్సివుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles