India's 8th Coronavirus Fatality in Mumbai కరోనా అలర్ట్: లాక్ డౌన్ దేశ ప్రధాని అసంతృప్తి..

People not taking coronavirus lockdown seriously pm modi

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

PM Modi appealed people to take lockdown measures seriously. Sharing his thoughts on Twitter, Modi said that people should save themselves and their family, and follow lockdown instructions seriously. Modi also requested state governments to ensure that rules and laws are followed.

కరోనా అలర్ట్: లాక్ డౌన్ దేశ ప్రధాని అసంతృప్తి.. సీరియస్ గా తీసుకొవాలని వినతి

Posted: 03/23/2020 12:55 PM IST
People not taking coronavirus lockdown seriously pm modi

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్‌లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం నాటికి 419 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అముల చేస్ున్న లాక్ డౌన్ కు ప్రజల నుంచి స్పందన కరువవుతుంది. దీంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ట్విటర్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని అన్నారు. విధిగా ఆరోగ్య సూచనలు పాటించాలని సూచించారు.

ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం పోంచివున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు నగరాల్లో ‘లాక్‌డౌన్ అమలు చేస్తే దానిని తేలిగ్గా తీసుకుని ప్రజలు నిర్లయం వహించడం సముచితం కాదని, వస్తున్న ఉపద్రవాన్ని తేలిగ్గా తీసుకోవడమే అవుతుందని ఆయన అబిప్రాపడ్డారు. ‘‘లాక్ డౌన్ పై నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకని ప్రకటించామో గుర్తించాలి. తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్కరూ విధిగా నియమాలు పాటించాలి. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని’ మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు మహమ్మారి ప్రభావం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పరిశ్రమలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేం‍ద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలను ఉ‍ల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దేశవ్యాప్తంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ మార్చి 31వరకు కొనసాగనుంది. అన్ని మెట్రో, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలను మార్చి 31 వరకు నిలిపివేయగా, అత్యవసర సరుకులు, మందుల కొరత రాకుండా ఆయా ప్రభుత్వాలు సంబంధిత చర్యలను తీసుకుంటున్నాయి. పాల ఉత్పత్తులు, కిరాణా షాపులు, పెట్రోల్ పంపులు లాంటి అవసరమైన సేవలు మాత్రమే ప్రజల సౌలభ్యం కోసం తెరిచి ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles