CM YS Jagan reviews on Coronavirus outbreak కరోనా అలెర్ట్: తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత రేషన.. రూ.1000

Coronavirus cm ys jagan to give free ration and rs 1000 to white card holders

coronavirus in Andhra Pradesh, covid-19 in Andhra Pradesh, coronavirus andhra pradeesh, covid-19 andhra pradesh, coronavirus, covid-19, corona spread, state lock down, cm ys jagan,Free Ration,white ration card holders, Andhra pradesh, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india

AP CM YS Jagan reviewed the coronavirus outbreak in the state. Chief Minister inquired about the present situation in the wake of the Janata Curfew over coronavirus. He ordered to take all precautions from time to time dye to increase in the positive cases.

కరోనా అలెర్ట్: తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత రేషన.. రూ.1000

Posted: 03/23/2020 11:52 AM IST
Coronavirus cm ys jagan to give free ration and rs 1000 to white card holders

ఆంద్రప్రదేశ్ లో కరోనా పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్.. దేవుడి దయంతో కరోనా వైరస్ తమ రాష్ట్రంలో విజృంభించడం లేదని, అధికారులు అన్ని విధాల చర్యటు లీసుకుని దానిని నియంత్రిస్తున్నారని అన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 415 కేసులు నమోదు అయితే.. దాదాపుగా 8 మంది వరకు వైరస్ బారినపడి చనిపోయారని చెప్పారు. తమ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. అందులో ఒక కేసు నయమైందని, ఒకరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసినట్టు జగన్ చెప్పారు.

అయితే కరోనా వ్యాధి కట్టడికి మార్చి 31 వరకు ఏపీ లాక్ డౌన్ చేయనున్నట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నట్టు చెప్పారు. నిత్యావసర సర్వీసులు మాత్రం పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిమిత సంఖ్యలో రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారని తెలిపారు. దేశాల నుంచి వచ్చిన వాళ్లు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ అవ్వాలని సూచించారు. ప్రజలందరికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మార్చి 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పోవాలని చెప్పారు.

ఈ నెల 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు. 10 మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని జగన్ సూచించారు. రైతులు, రైతు కూలీలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. నీళ్లు, కూరగాయలు, పాలు, ఎలక్ట్రిసిటీ, మెడికల్, గ్యాస్, పెట్రోల్ బంకులు, వాటర్ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 10 ఏళ్ల లోపు పిల్లలను తల్లిదండ్రులు బయటకు పంపొద్దన్నారు. 60 ఏళ్ల దాటిన వృద్ధులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాలకి కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 75 జిల్లాల్లో కరోనా నిర్భంధం కొనసాగుతోంది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్ర ఆదేశించింది. ఈ జిల్లాల నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రత్యేకించి ఈ జిల్లాలోని వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని రకాల ఆంక్షలను కేంద్రం అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖలవారీగా అందరిని సమన్వయపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh