దేశరాజధానిలో కదులుతున్న బస్సులో యువతిపై అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడిన నిర్భయ సామూహిక అత్యాచార, హత్య కేసులో దోషులకు ఎట్టకేలకు ఏడేళ్ల మూడు నెలల తరువాత బాధిత కుటుంబానికి న్యాయం లభించింది. ఈ దారుణ హత్యచార ఘటన నేపత్యంలో దేశంలోని మహిళల రక్షణకు నూతనంగా నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అంతేకాదు మహిళలపై అత్యాచార కేసుల కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటయ్యాయి. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దోషులకు ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైలు అధికారులు మరణశిక్షను అమలు చేశారు.
ఢిల్లీలోని పాటియాల కోర్టు విధించిన మరణశిక్షను రాష్ట్రోన్నత న్యాయస్థానంతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా స్వాగతించింది. దీంతో ఉరిశిక్ష అమలు నేపథ్యంలో దోషులు చివరి వరకు చేసిన ప్రయత్నాలు.. . నాలుగో పర్యాయం ఫలించలేదు. ఇదివరకే మూడు పర్యాయాలు జారీ చేసిన డెత్ వారెంట్ ను దోషులు చాకచక్యంగా చివరి నిమిషంలో కోర్టులను ఆశ్రయించి తమ వాయిదాలు వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు వారికి పక్షం రోజుల సమాయాన్ని ఇచ్చి.. ఈ గడువులోగా అన్ని న్యాయపరమైన అవకాశాలని వారు వినియోగించుకోవాలని అదేశించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 3వ తేదీని నాలుగవ పర్యాయం నిర్భయ దోషులకు న్యాయస్థానం మార్చి 20న మరణశిక్షను అమలు చేసేందుకు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ పర్యాయం కూడా శిక్ష నుంచి తప్పించుకనేందుకు దోషులు అనేక ఎత్తులు వేసారు. అయితే న్యాయస్థానాలతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా చిట్టచివరి నిమిషంలో దోషుల అబ్యర్థనలను, పిటీషన్లను తోపిపుచ్చడంతో ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలు అధికారులు వారికి మరణదండన అమలు చేశారు.
నిర్భయ కేసులో ఆరుగురు దోషులు కాగా, అందులో ఒకరు జువైనల్ కావడంతో అతడిని శిక్ష విధించిన న్యాయస్థానం శిక్షాకాలం పూర్తి కావడంతో వదిలివేసింది. అయితే మరో దోషి రామ్ సింగ్ దోషిగా నిర్ధారణ కావడంతోనే జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో మిగిలిన నలుగురు దోషులకు ఇవాళ తీహార్ జైలు అధికారులు మరణశిక్షను అమలు చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీశాడు. దక్షిణాసియా దేశంలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరితీయడం ఇదే తొలిసారి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి క్షణం వరకు దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలితంచలేదు. చట్టపరంగా వారికి ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత వారికి ఉరిశిక్ష అమలైంది. నిర్భయ దోషులకు మరణ దండన అమలు కావడంపై నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more