IRCTC warns account holders not to be prey for fraudsters ఐఆర్సీటీసీ ఖాతాదారులూ.. తస్మాత్ జాగ్రత్తా..

Irctc warns its users not to share confidential and personal details to avoid cyber frauds

IRCTC warns its users, Irctc warns its account holders, irctc account holders, irctc fraudstes, irctc ticket booking, IRCTC refund process, IRCTC refund status, IRCTC ticket cancellation, IRCTC complaint status

Indian Railway cateering and tourism corperation IRCTC warns its users not to share confidential and personal details to avoid cyber frauds

ఐఆర్సీటీసీ ఖాతాదారులూ.. తస్మాత్ జాగ్రత్తా.. అధికారుల హెచ్చరిక

Posted: 03/03/2020 11:55 AM IST
Irctc warns its users not to share confidential and personal details to avoid cyber frauds

మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా? ఆన్ లైన్ ద్వారా మీరు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటూవుంటారా.? అయితే సదరు అధికారులు మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ ఖాతాలకు సంబంధించిన సమాచారంతో పాటు అందులోని మీ వ్యక్తిగత వివరాలను కూడా చాలా గోప్యంగా వుంచాలని అప్రమత్తం చేస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేయడంతో పాటు మీ అకౌంట్లు ఖాళీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

అందుకే అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు నెంబర్, పిన్, సీవీవీ, యూపీఐ లాంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి సందర్భంలో బహిరంగ ఫ్లాట్ ఫామ్స్ పై పెట్టరాదని, ఇలాంటివి ఐఆర్సీటీసీ ఎంత మాత్రం కోరదని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు ఫోన్ కాల్స్‌, ఎస్ఎంఎస్, ఇమెయిల్స్‌ కూడా ఎవరితో షేర్ చేయొద్దని సూచిస్తోంది. ఐఆర్సీటీసీ అధికారులమని, బ్యాంకు సిబ్బంది పేరుతో ఏవరైనా కాల్స్ చేసి, మీ వివరాలన్నీ సరిగ్గా చెప్పి మిమ్మల్ని నమ్మించే అవకాశముంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి సైబర్ నేరగాళ్ల మాయమాటలకు లొంగిపోరాదని.. వారి చేతుల్లో ఎలాంటి సమాచారం పెట్టవదని ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది.

ఇలాంటి తప్పులు చేస్తే.. క్షణాల్లో మీ అకౌంట్‌లో డబ్బులు క్షణాల్లో ఖాళీ అవుతాయని కూడా హెచ్చిరించింది. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలని కోరుతూ తమ సిబ్బంది ఎవరూ ఫోన్‌, ఇమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా కాంటాక్ట్ చేయరని చెబుతోంది ఐఆర్సీటీసీ. మీ వ్యక్తిగత సమాచారంతో పాటు ఐఆర్సీటీసీ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌ వర్డ్, ఓటీపీ లాంటి వివరాలేవీ చెప్పకూడదు. రీఫండ్స్, టీడీఎస్, ఇ-టికెట్ క్యాన్సలేషన్ లాంటివన్నీ ఆటోమెటిక్ గా ప్రాసెస్ అవుతుంటాయి. ఐఆర్సీటీసీ ఇ కేటరింగ్, ఎయిర్, టూరిజం లాంటి రీఫండ్ ప్రాసెస్లో మానవ ప్రమేయం ఉండదని కూడా స్పష్టం చేసింది.

మీ రీఫండ్ మీరు బుకింగ్ సమయంలో ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్లోకి అటోమేటిక్ గా జమఅవుతాయని చెప్పింది. రీఫండ్ ప్రాసెస్‌లో ఏవైనా అనుమానాలు ఉంటే ఐఆర్‌సీటీసీ అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారానే కంప్లైంట్ ఇవ్వాలి. అంతే తప్ప ఇతరులు ఎవరైనా కాల్ చేస్తే వివరాలు చెప్పొద్దు. ఇక మీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. దీని వల్ల వాటిని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఐఆర్‌సీటీసీకి మీరు ఏదైనా ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే మెయిల్ ఐడీ, టోల్ ఫ్రీ నెంబర్ల కోసం గూగుల్‌లో వెతకొద్దు. ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని కాంటాక్ట్ డీటెయిల్స్‌ ద్వారానే పిర్యాదు చేయాలని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles