Farmers can get up to Rs 3 lakh loan with KCC Scheme #నోసార్ హ్యాష్ ట్యాగ్ వైరల్.. తనదైన శైలిలో స్పందించిన రాహుల్

Thinking of giving up social media says modi rahul gandhi asks him to give up hatred instead

Narendra Modi, Social Media, Facebook, Twitter, Instagram, Rahul Gandhi, Congress, Hatred, National, Politics

Reacting to this, Congress leader Rahul Gandhi tweeted saying: “Give up hatred, not social media accounts”. Congress spokesperson Randeep Singh Surjewala urged Modi to ask online trolls to do the same.

#నోసార్ హ్యాష్ ట్యాగ్ వైరల్.. తనదైన శైలిలో స్పందించిన రాహుల్

Posted: 03/03/2020 10:18 AM IST
Thinking of giving up social media says modi rahul gandhi asks him to give up hatred instead

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. అయితే ఈ ఆదివారం నుంచి తాను సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలని భావించినట్టు మోదీ వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను.. అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లను కలిగివున్న ప్రధాని.. తన అకౌంట్ల నుంచి తప్పుకోవాలని భావించడం అభిమానులకు రుచించలేదు.

ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన ట్వీట్ చేసిన గంట వ్యవధిలోనే 26 వేలసార్లకు పైగా రీ ట్వీట్ అయింది. క్షణానికో కామెంట్ వచ్చింది. మోదీ నుంచి నిరంతర అప్ డేట్స్ కొనసాగాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అత్యధికులు కోరడం గమనార్హం. ఈ నేపథ్యంలో 'నో సార్' అని కొన్ని వేల కామెంట్లు వచ్చాయి. "కావాలంటే చిన్న బ్రేక్ తీసుకోండిగానీ, పూర్తిగా వదిలేయవద్దు" అని కూడా కామెంట్లు వచ్చాయి. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, మోదీ వదిలేస్తే తామూ సోషల్ మీడియాను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఇక 'నో సార్' హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది.

కాగా, సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో 5.33 కోట్లమంది, ఫేస్‌ బుక్‌ లో 4.4 కోట్ల మంది, ఇన్‌ స్ట్రాగామ్‌ లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లను కలిగివున్న టాప్ - 3 నేత, ఫేస్ బుక్ లో టాప్-2 నేత ప్రధాని నరేంద్రమోదీ కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు టొనాల్డ్ ట్రంప్‌ సైతం భారత పర్యటన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఎందుకు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం ప్రధాని వెలువరించలేదు.

ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో.. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తనదైనశైలిలో రాహుల్ గాంధీ మోడీకి చురకలంటించారు. వదిలేయాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ హితవు పలికారు. అటు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. మన ప్రధాని అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు కదా! అంటూ చమత్కరించారు. లేకపోతే, డిజిటల్ మాలిన్యాలను తొలగించే సున్నితమైన ప్రక్రియ గురించి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.​

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Social Media  Facebook  Twitter  Instagram  Rahul Gandhi  Congress  Hatred  National  Politics  

Other Articles