వారిద్దరూ ఉన్నత వ్యక్తులు. ఉన్నత విద్యావంతులైనంత మాత్రన ఉన్నత వ్యక్తులు కాలేరు. ఉన్నతమైన భావాలు, తమ వంతు సేవాభావంతో మాత్రమే మనుషుల్లో అణిముత్యాలుగా మిగిలిపోతారు. సినీకవులు ఎప్పుడో చెప్పినట్లుగా కృషి వుంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు.. అన్నట్లుగానే ఈ జంట కూడా ఆ పరిగణలోకే వస్తుంది. రైల్వే ఫ్లాట్ ఫాంపై పడుకుని.. సా మిల్ లో ఆపరేటర్ గా ఎదిగిన ఆ వ్యక్తి.. తన కృషి పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఏఎస్ అధికారిగా.. తిరునెల్వేలి సబ్ కలెక్టరుగా.. బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన పేరే.. శివగురు ప్రభాకరన్.
ఆయనకు ఇటీవల ఓ వైద్యురాలితో వివాహం జరిగింది. అయితే ఆయన నేరుగా తనకు కాబోయే భార్యనే వరకట్నం అడిగాడు. అదేంటి.. వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడం తప్పని.. అలా చేస్తే తప్పకుండా శిక్షార్హమని.. ఐఏఎస్ చదువుకున్న వ్యక్తులకు తెలియదా.? అంటే.. తెలుసు. అయినా.. వరకట్నం లేకుండా ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయ్. నో డౌర్రీ అన్న ప్రచారం ఇంకా గర్భస్థ సాయిలోనే వుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఐఏఎస్ అధికారి అడిగిన కట్నం విన్న తరువాత.. అతనికి కాబోయే భార్య కూడా కొంత ఆశ్చర్యానికి గురై.. ఆ తరువాత తేరుకుందట. కాబోయే భర్త అడిగిన వరకట్నం ఇచ్చందుకు సమ్మతించింది. ఇంతకీ ఆ కట్నంమెంటో తెలుసా.?
తన కాబోయే భార్య వారంలో రెండు రోజులు పేదలకు ఉచిత వైద్య సేవలందించాలని షరతు పెట్టారు. అదే అమె తనకిచ్చే వరకట్నంగా కోరుకుంటున్నాడు. ఇదే విషయాన్ని ఆయన అమెతో చెప్పాడు. దీంతో ఆమె కొంత విస్మయానికి గురైంది. ఆ తరువాత వెంటనే తేరుకుని.. ఇంతటి ఉన్నత భావాలు వున్న వ్యక్తి తనకు భర్తలా లభించడం పట్ల అమె ఎంతో సంతోషించింది. చెన్నైకి చెందిన ఓ గణిత అధ్యాపకుడి కుమార్తె డాక్టర్ కృష్ణభారతితో తనకు వివాహం నిశ్చయైన తరువాత.. కట్నకానులక ప్రస్తావన సమయంలో నేరుగా కాబోయే భార్యనే ఈ కలెక్టర్ ఈ మేరకు తన వరకట్నం ఇవ్వాల్సిందిగా కోరడం.. అందుకు అమె సమ్మతించడం.. దీంతో వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగింది.
వారంలో రెండు రోజులు ప్రభాకరన్ స్వగ్రామమైన ఒట్టంకాడు, పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న షరతు త్వరలోనే అమలు కానుంది. ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ప్రభాకరన్ తొలుత రైల్వేలో ఉద్యోగం చేశారు. అనంతరం పట్టుదలతో ఐఏఎస్ చేశారు. ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ‘డాక్టర్ ఏపీజే గ్రామ అభివృద్ధి బృందం’ ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, శ్రమదానం కింద చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more