quadragenarian groped along with four daughters సీఏఏ అల్లర్లు: ‘‘లైంగికదాడితోనే ఇంటిపై నుంచి దూకాం’’

Delhi violence we jumped out from first floor of building after mob molest us

CAA Protests, Delhi violence, Delhi Riots, delhi clashes, Anurag Thakur, BJP, delhi burning, delhi police, delhi riots, delhi riots today, Delhi violence, delhi violence deaths, Kapil Mishra, northeast delhi protests, Delhi violence, clash in delhi, Al Hind Hospital, Arvind Kejriwal, Ashok Nagar, caa protest violence, Chand Bagh, delhi clashes, Delhi violence, delhi violence deaths, Jaffrabad, Kapil Mishra, Shaheen Bagh, northeast delhi riots, Citizenship amendment act, Narendra Modi, Amit Shah, National Politics, Crime

We jumped from the first floor with dupattas wrapped around our bodies to save ourselves," says a 45-year-old woman at northeast Delhi's Al-Hind Hospital, recalling how she and her two daughters were forced to flee their home after a mob allegedly barged in and molested them.

సీఏఏ అల్లర్లు గాయలు: ‘లైంగికదాడితోనే ఇంటిపై నుంచి దూకాం’

Posted: 02/29/2020 02:58 PM IST
Delhi violence we jumped out from first floor of building after mob molest us

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో రేగిన అల్లర్లతో స్థానికులు భయాందోళన గురయ్యారు. అల్లర్ల మాటును అందోళనకారులు ఆడవారిపై అఘాయిత్యాలకు కూడా తెగబడే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. మహిళలను లైంగికంగా వేధించారని.. వారి చేతుల్లో పడితే ఏం జరుగుతుందోనని ఊహించే.. ప్రాణాలను పణంగా పెట్టీ మరీ భవంతుల పైనుంచి దూకామని బాధితులు తాము ఎదుర్కొన్న బాధను కన్నీళ్ల పర్యంతమై వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొన్న భయంకర అనుభవాలను బాధితులు మీడియాకు వివరిస్తున్నారు.

తమ ఇంట్లోకి రాత్రి సమయంలో ఒక గుంపు ప్రవేశించి తనను, తన ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించారని ఓ మహిళ తెలిపింది. దీంతో భయంతో వణికిపోయామని, చివరకు శరీరానికి దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశామని చెప్పింది. చివరకు చెత్త ఏరుకుని బతికే వారిని కూడా అల్లరి మూకలు వదలట్లేదు. చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లిన షబ్బీర్‌ అనే యువకుడిపై అల్లరి మూకలు దాడిచేయడంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి. తమకు అసలు ప్రశాంతంగా వుండే ఢిల్లీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదని బాధితుడి తండ్రి తెలిపారు.

తమది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అని.. అల్లర్లు జరుగుతున్నప్పటికీ తమకు వాటితో సంబంధం లేదని అనుకున్న తన కుమారుడు చెత్త ఏరుకోవడానికి వెళ్లాడని, అతడిని ఎదురోచ్చిన ఓ గుంపు అతనిపై దాడి చేసిందని తెలిపారు. ఏమీ తెలియని తన అమాయక కొడుకుపై దాడి ఎందుకు చేశారని తన కొడుకు అడుగుతున్నాడని సల్మాన్ అనే వ్యక్తి తెలిపాడు. రోడ్డుపై కనిపించిన వారిని పట్టుకుని పేరు, మతం అడిగి కొందరు దారుణంగా కొడుతున్నారని అరోపించాడు. ఇదిలావుండగా, ఢిల్లీ అల్లర్ల బాధితులకు జేఎన్‌యూ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామన్న విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూనివర్సిటీ క్యాంపస్‌ను పునరావాస కేంద్రంగా మార్చే అధికారం విద్యార్థి సంఘాలకు లేదని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందగా, ఎంతోమంది గాయపడ్డారు. బాధితులకు యూనివర్సిటీ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామంటూ ఈనెల 26వ తేదీన విద్యార్థి సంఘాల నేతలు ట్వీట్‌ చేశారు. ఈ మెసేజ్ పై రిజిస్ట్రార్‌ తాజాగా స్పందించారు. ‘యూనివర్సిటీ క్యాంపస్‌ విద్యార్థులు, పరిశోధకుల కోసం ఉద్దేశించింది. అటువంటి క్యాంపస్ లో అల్లర్ల బాధితులకు ఆశ్రయం కల్పిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’ అని రిజిస్ట్రార్‌ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles