PIL filed in High Court against unaided junior colleges ఏప్రిల్ 3 లోపు నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు తాళాలు.!

Pil filed in high court against unaided junior colleges in telangana

Public Interest Litigation, corporate colleges, Narayana junior college, Sri Chaitanya junior college, Sri Gayatri junior college, NRI junior college, Inter corporate colleges, Students, No Proper Permissions, April 3 junior colleges, Telangana High Court, Telangana, Politics

A PIL has been filed seeking action against unrecognized branches of Sri Chaitanya and Narayana colleges. The Board of Intermediate Education, which submitted a report to the High Court said that they have issued show-cause notices to the colleges which did not have a no-objection certificate (NOC) from the fire department.

ఏప్రిల్ 3 లోపు నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు తాళాలు.!

Posted: 02/27/2020 04:03 PM IST
Pil filed in high court against unaided junior colleges in telangana

తెలంగాణలో గుర్తింపులేని, సరైన అనుమతులు లేని కార్పోరేట్ కాలేజీల విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు చర్యలు తీసుకోవాలని తాజాగా అదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 3 లోగా రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయత్రి, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలల అనుమతి లేని కాలేజీలపై చర్యలు తీసుకుని.. అందుకు సంబంధించిన నివేదికను తమకు అందించాలని అదేశాలు జారీ చేసింది. దీంతో అనుమతులు లేకుండా, బిల్డింగ్ పర్మీషన్లు, అగ్నిమాపక దళం నుంచి పర్మీషన్ లేని భవనాలకు ఇక థాలాలు పడనున్నాయి.

సరైన అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలు అడుతున్న కార్పోరేట్ కాలేజీ బ్రాంచిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇంటర్‌ బోర్డు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ‘‘అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ లేని కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని పేర్కోన్నారు. కాగా మార్చి 4 నుంచి పరీక్షలు ఉన్నందున  కళాశాలలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం ఉంటుంది.

మరో వారం రోజుల వ్యవధిలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని న్యాయస్థానానికి తెలిపారు. ఈ సమయంలో ఇప్పటికిప్పుడు కళాశాలలు మూసివేస్తే వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. గుర్తింపు లేని కళాశాలల్లో 29,808 మంది విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపకశాఖ ఎన్‌వోసీ లేని కళాశాలల్లోనూ పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. పరీక్షలు ముగిసిన తర్వాత కళాశాలలు మూసివేసేందుకు అనుమతివ్వాలి’’ అని ఇంటర్‌ బోర్డు హైకోర్టును కోరింది. అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles