IYR krishna rao tweet makes this video viral ఫన్నీ వీడియోను వైరల్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు

Inventions become useful people start innovating tweets iyr krishna rao

AP former chief Secretary, IYR Krishna Rao, Retired IAS, Gujarat, Gujarat women,women, DCM Van, innovative ideas, Twitter, viral video, jcb, Andrha Pradesh, politics

Andrha Pradesh former chief secretary IYR Krishna Rao makes a tweet viral by commenting on the tweet posted by a twitterati. The Retired IAS says Inventions become useful as people start innovating.

ఫన్నీ వీడియోను వైరల్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు

Posted: 02/24/2020 03:59 PM IST
Inventions become useful people start innovating tweets iyr krishna rao

శంఖంలో పోస్తేకానీ తీర్థం కానట్టు.. నెట్టింట్లోనూ ఎందరో పోస్టు చేసే వీడియోలు కొందరు ప్రముఖుల నుంచి కామెంట్లు వచ్చిరావడంతోనే వైరల్ గా మారుతుంటాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఇలాంటి ఎన్నో వీడియోలో ప్రముఖుల కంట పడకుండా మరుగున పడిపోయాయి. అయితే తీరిక లభిస్తే మాత్రం ప్రముఖలు ఆ వీడియోలకు తమదైన కామెంట్లను జోడించడంతో అవి వైరల్ గా మారడం మనం చూస్తూనే వున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ట్విటర్లో పోస్టు చేసిన ఓ ఆసక్తికరమైన వీడియోను ఇలానే హల్ చల్ చేస్తోంది.

విషయానికొస్తే.. జేసీబీని సాధారణంగా మట్టి తవ్వకాలకు, ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తడానికి, భూమిని చదను చేయడానికి, ఎత్తు పల్లాలను సరిచేయడంతో పాటు ఇంకా అనేక పనులకు ఉపయోగిస్తుంటారు. కానీ గుజరాత్లో మాత్రం కొందరు మహిళలు దీనిని విభిన్నంగా వాడారు. ఓ చిన్న సైజు ఎలివేటర్ మాదిరిగా జేసీబి సేవలు అందించింది. అదేంటి జేసీబీ ఎంటీ..ఎలివేటర్ మాదిరిగా ఎలా.? అని విస్మయం చెందకండి. గుజారత్ లో డీసీఎం వాహనంలో ఎక్కిన కొందరు మహిళలు.. దాని నుంచి దిగడానికి వెనుకంట వేస్తున్నారు. జేసీబీ నుంచి దిగే క్రమంలో దూకాల్సివస్తుందని, ఆ సమయంలో కాలు బెణికినా.. లేక ఎలాంటి గాయాలైనా తాము బాధపడాల్సి వస్తుందని అలోచనలో పడ్డారు.

ఇంతలో అటుగా వున్న జేసీబిని చూసి దాన్ని ఎలివేటర్ మాదిరిగా ఉపయోగించుకుంటే తాము సులభంగా దిగొచ్చని భావించారు. అంతే జేసీబీని పిలిచి దాని సాయంతో డీసీఎం వ్యానులోని మహిళతు దిగారు. ఇలా దిగుతూన్న సమయంలో ఆ మహిళలు కూడా నవ్వుఆపుకోలేకపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసిన ఓ వ్యక్తి 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎప్పుడూ బహుశా ఇప్పటిదాకా గుజరాత్‌లో పర్యటించి ఉండకపోవచ్చు.. తన ఆవిష్కరణలను ఇలా ఉపయోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. దీనిని ఐవైఆర్‌ రీట్వీట్‌ చేస్తూ.. ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే అటువంటి ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అంటూ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iyr Krishna Rao  Retired IAS  women  DCM Van  Gujarat  viral video  jcb  Andrha Pradesh  politics  

Other Articles