Vada Prasadam available to SriVari Devotees at Tirumala తిరుమల శ్రీవారి భక్తుల అందుబాటులోకి మరో ప్రసాదం

Tirumala trupati devasthanam brings vada prasadam available to srivari devotees

Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Vada Prasadam, Kalyanam Laddu Prasadam, recommendation letters, SriVari darshanam, Dharma reddy, devotional

Tirumala tirupati devasthanam Temple Board has taken desicion to issue Vada Prasadam to all the devotees without any recommendation letters from today.

తిరుమల శ్రీవారి భక్తుల అందుబాటులోకి మరో ప్రసాదం

Posted: 02/20/2020 01:39 PM IST
Tirumala trupati devasthanam brings vada prasadam available to srivari devotees

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతిలో ఇవాళ్టి నుంచి భక్తులకు మరో ప్రసాదం కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారి భక్తులకు శుభవార్తను వెలువరించింది. ఇప్పటి వరకు శ్రీవారి ప్రసాదంగా లడ్డూను మాత్రమే అందించే టీటీడీ.. ఇకపై వడ ప్రసాదాన్ని కూడా అందించనుంది. వడ ప్రసాదం ఇప్పటివరకు కేవలం కల్యాణోత్సవంలో పాల్గోన్న భక్తులకు మాత్రమే పరిమితమైంది.

దీనికితోడు సిఫార్సు లేఖలు తెచ్చిన భక్తులకు మాత్రమే వడ ప్రసాదం లభ్యమయ్యేది. కానీ ఇవాళ్టి నుంచి ఈ ప్రసాదం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి రానుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా వడ ప్రసాదం కోరిన భక్తులందరికీ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం భక్తులకు అవసరమైనన్ని వడలను ప్రసాదం కౌంటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ నెల 12న సాధారణ భక్తులకు కల్యాణం లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ.. ఇకపై వడ ప్రసాదాన్ని కూడా కొరిన భక్తులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. వడ ప్రసాదం కూడా కల్యాణం లడ్డూలు (పెద్ద లడ్డూలు) లభించే ప్రత్యేక కౌంటర్ లోనే లభ్యం కానున్నాయి. పెద్ద లడ్డూల ధర రూ.200. ఇప్పుడు దీంతోపాటు వడ ప్రసాదాన్ని కూడా అందించనుంది. రోజుకు 10వేల కల్యాణం లడ్డూలు, 10వేల వడ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

మరోవైపు పాఠశాలల్లో విద్యార్థుల పరీక్షా సమయం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా రోజుల తరువాత తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఖాళీ అయింది. ఉదయం 6 గంటల సమయంలో కేవలం ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. వారికి స్వామివారి దర్శనం పూర్తి కావడంతో, వీఐపీ బ్రేక్ తరువాత, దర్శనానికి వెళ్లిన వారు ఎక్కడా ఆగకుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. సర్వ, దివ్య తదితర అన్ని దర్శనాలకూ ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. కాగా, క్రితం రోజున స్వామి వారిని 68,065 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles