Pawan Kalyan donates Rs 1 crore for welfare of soldiers సైనిక్ బోర్డుకు పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం

Pawan kalyan donates rs 1 crore for welfare of soldiers

Pawan Kalyan, JanaSena, Rs 1 crore donation, Army Flag Day. welfare of armymen''s families, Kargil war, Vignan Bhavan, Indian Stiudents Parliament, Delhi, BJP, Andhra Pradesh, Politics

Janasena Party leader and Telugu film star Pawan Kalyan on Thursday donated Rs 1 crore for the welfare of armymen''s families to authorities at the Kendriya Sainik Board here. The popular film star and politician had promised the donation last year on the eve of Army Flag Day.

కేంద్రీయ సైనిక్ బోర్డుకు పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం

Posted: 02/20/2020 02:58 PM IST
Pawan kalyan donates rs 1 crore for welfare of soldiers

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటినలో వున్నారు. దేశరాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనున్న ఆయన సదస్సులో ఉపన్యసించనున్నారు. ఈ మేరకు వచ్చిన ఆహ్వానాన్ని మన్నించిన ఆయన హస్తిన పర్యటనలో బిబీగా వున్నారు. కాగా ఈ ఉదయం పవన్ కల్యాన్ కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు. గతంలో తాను ఈ విరాళాన్ని అందజేయాలని అనుకున్నా ఇవాళ కుదరడంతో అందజేసినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ''ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే' సందర్భంగా సైనికులకు ఏం చేయగలనని అనుకున్నాను. దేశం కోసం తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా పెట్టిన మహనీయుల కుటుంబాల సంక్షేమానికి ఏదైనా చేయాలని తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా ఇద్దామని అనుకున్నానని తెలిపారు. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు.. ఇప్పుడొచ్చి ఇచ్చాను. ఇదే సందర్భంగా ఆయన జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు.

ఎవరైనా ఈ సైనిక బోర్డుకు తమ వంతు సాయాన్ని అందించవచ్చునని.. ప్రతీ ఒక్కరూ తమ వంతుగా సాయం అందిచాలని పవన్ పిలుపునిచ్చారు. 'ఢిల్లీలో రాజకీయ నేతలను ఎవరినైనా కలుస్తానా? లేదా? అన్న విషయంపై ఏమీ చెప్పలేను.. నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పారు. ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనాలని తనకు ఆహ్వానమందిందని తెలిపారు. కాగా, కాసేపట్లో విజ్ఞాన్ భవన్‌కు వెళ్లి ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles