Kerala CM condoles death of people in TN accident కేరళ బస్సును ఢీకొన్న కంటైనర్.. తక్షణ చర్యలకు సీఎం అదేశం

19 dead in tamil nadu road accident as kerala bound bus rams into truck in tirupur

tamil nadu accident, tamil nadu, coimbatore, coimbatore accident, coimbatore bus accident, coimbatore mishap, bus accident, kerala bus, kerala bus accident, kerala state transport bus, KSRTC Bus, Kerala RTC Bus, Kerala, Tamil Nadu, Road accident, bus accident, lorry accident, pinarayi vijayan

At least 19 people have died in a horrific bus accident in Tamil Nadu's Tirupur as KSRTC Bus collided with a container truck in Coimbatore, fatally wounding many passengers. The accident took place on the Coimbatore highway. The truck was reportedly moving on the wrong side of the road.

కేరళ బస్సును ఢీకొన్న కంటైనర్.. తక్షణ చర్యలకు సీఎం అదేశం

Posted: 02/20/2020 10:41 AM IST
19 dead in tamil nadu road accident as kerala bound bus rams into truck in tirupur

తమిళనాడులోని కోయంబత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళలోని ఎర్నాకులం నుంచి కర్నాటక రాజధాని బెంగుళూరు వెళ్తున్న కేరళ ఆర్టీసీకి చెందిన బస్సును.. కోయంబత్తుర్ నుంచి సేలం జాతీయ రహదరాపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ మార్గమద్యంలో రాంగ్ సైడ్ లో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. వీరలో ఐదురుగు మహిళలు, 14 మంది పురుషులు వున్నారు.

ఘటనా స్థలంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. మృతుల్లో బస్సు కండక్టర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో 23 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు అందోళన చెందుతున్నారు. కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద ఈ తెల్లవారుజామున ఈ దారుణ దుర్ఘటన జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని, అన్ని సీట్లు బుక్ అయ్యాయని అధికారులు తెలిపారు. బాధితుల్లో చాలామంది త్రిసూర్, పాలక్కాడ్, ఎర్నాకుళానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరు నుంచి తమ స్వగ్రామాలకు పయనం కాగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సులో ప్రయాణిస్తూ.. చల్లని గాలికి అదమరచి నిద్రపోతున్న ప్రయాణికులు నిద్రలోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అవినాశిలోని ఘటనాస్థలం వద్ద విషాధఛాయలు అలుముకున్నాయి.

ఇక క్షత్రగాత్రులను చికిత్సపోందుతున్న ఆసుపత్రుల వద్ద కూడా క్షతగాత్రుల ఆర్తనాధాలతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదిలావుండగా, ప్రమాదఘటన సమాచారం అందుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించాలని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహాయ చర్యలు చేపడతామని తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Tamil Nadu  Road accident  bus accident  lorry accident  pinarayi vijayan  Crime  

Other Articles