Girls pledged against love marriage ప్రేమికుల రోజు విద్యార్థినులతో వినూత్న ’ప్రమాణం’

Girl students in amravati solemnly swore not to have love marriages

Mahila Arts and Commerce College, Girl Students, pledge, Valentines Day, Vidrabha, love marriages, Amaravati, Chandur, Pankaja Munde, Maharashtra, crime

Even as youth all over the world were celebrating Valentine's Day, girl students at a college in Amravati solemnly swore not to have 'love marriages'.The girls are first- and second-year BA students at the Mahila Kala Vanijya Vidya-laya at Chandur (Railway) in Amaravati district.

ITEMVIDEOS: ప్రేమికుల రోజు విద్యార్థినులతో వినూత్న ’ప్రమాణం’

Posted: 02/15/2020 05:09 PM IST
Girl students in amravati solemnly swore not to have love marriages

పురాతన ప్రేమకు ప్రతిరూపంగా.. సాక్షిభూతంగా నిలచే ప్రాంతమది. ప్రేమ పేరు చెప్పగానే హిందువులకు గుర్తుకువచ్చే శ్రీకృష్ణుడు తన శాంతస్వాభావి రుక్మిణి దేవి పెరిగిన ప్రాంతమది. తన కళ్యాణ జరుగుతున్న క్రమంలో శ్రీకృష్ణుడిపై ప్రేమతో అదే రోజున శ్రీకృష్ణుడి సోదరసమానుడైన శిశుపాలుడి సహాయంతో పారిపోయి గోపాలుడిని పరిణయం అడింది. ఈ ప్రేమకావ్యానికి.. నాటి మధుర జ్ఞాపకాలకు నెలవుగా వున్న ప్రాంతంలో తాము ప్రేమ పెళ్లి చోసుకోబోము అంటూ అమ్మాయిల చేత వినూత్నంగా ప్రమాణం చేయింది ఇక్కడి ఓ కళాశాల. ఇలా చేసిన ఇప్పుడా పాఠశాల వార్తల్లోకి ఎక్కింది.

ఇంతకీ ఆ ప్రాంతమేది.? ఎక్కడుంది.? అసలు ఆ కళాశాల ఎదీ.? ఎందుకిలా ప్రమాణం చేయించింది.? అమ్మాయిల చేతనే ఎందుకు ఈ విధమైన ప్రమాణం చేయించిందన్న అనుమానాలు కలుగుతున్నాయా.? ఈ డీటైల్స్ లోకి ఎంట్రీ ఇస్తే.. రుక్మిణీ దేవి పెరిగిన ఈ ప్రాంతం అమరావతి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత ఈ ప్రాంతం వుంది. పురాణ ఇతిహాసాలకు రామేశ్వరం త్రేతాయుగానికి సాక్షిభూతంగా నిలిస్తే.. ద్వాపరయుగానికి గుజరాత్ సహా మహారాష్ట్రలోని విదర్భ కూడా అప్పటి వారసత్వ సంపదకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇక్కడే నెలకొన్న ఓ మహిళా కళాశాలలో ప్రేమికుల రోజున విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

ప్రేమికుల రోజును ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన ప్రాంతంలో అందుకు భిన్నంగా ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థినులతో ప్రమాణం చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి జిల్లా చండూరు రైల్వే ప్రాంతంలోని మహళా ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థినులంతా కళాశాలకు రాగానే వారితో ప్రేమకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. ‘నా తల్లిదండ్రులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ప్రేమలో పడను. ప్రేమ పెళ్లి చేసుకోను. అంతేగాక, కట్నం తీసుకునేవాడిని కూడా పెళ్లి చేసుకోను’ అని విద్యార్థినులు మరాఠీలో ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. ‘ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏముంది..? పెళ్లి విషయంలో మన తల్లిదండ్రులే సరైన నిర్ణయం తీసుకుంటారు. మనకు సరిపోయే వ్యక్తిని తీసుకొస్తారు. అందుకే మేం ప్రేమ పెళ్లికి వ్యతిరేకం’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ప్రమాణాలపై బీజేపి నేత, మాజీ మంత్రి పంకజ్ ముండే తీవ్రంగా స్పందించారు. అమ్మాయిల చేతనే ప్రమాణాలు ఎందుకు చేయించారని, బాలుర చేత ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. ఇక అమరావతి పురాణ ఇతిహాసంలోకి వెళ్తే.. అమరావతి ప్రాంతంలోని కౌండిన్యపూర్ గ్రామం.. ఒకప్పటి విదర్భకు రాజధాని అని, దానిని భీష్మిక అనే రాజు పాలించేవాడని సమాచారం. కాగా, రుక్మిణి శ్రీకృష్ణుడిని ప్రేమించి పెళ్లి రోజున ఇంట్లోంచి శిశుపాలుడి సాయంతో పారిపోయి గోపాలుడ్ని పెళ్లాడిందని పురాణ కథ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girl Students  pledge  Valentines Day  Vidrabha  love marriages  Amaravati  Chandur  Pankaja Munde  Maharashtra  

Other Articles