Supreme Court issues notice to telecom companies టెలికాం సంస్థలు, కేంద్రానికి ‘సుప్రీం’ తాకీదులు..

Agr case our conscience is shaken sc tells telecom firms serves contempt notice

supreme court, agr case, telecom companies, Justice Arun Mishra, adjusted gross revenue (AGR), Department of Telecommunications, bharti airtel, Vodafone

The Supreme Court on Friday issued contempt notices to telecom companies for not complying with its order where it had asked them to pay Rs 1.47 lakh crore to the Department of Telecom (DoT). Unhappy with the non-compliance.

టెలికాం సంస్థలు, కేంద్రానికి ‘సుప్రీం’ తాకీదులు..

Posted: 02/14/2020 10:16 PM IST
Agr case our conscience is shaken sc tells telecom firms serves contempt notice

బకాయి పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు టెలి కమ్యూనికేషన్ల డిపార్ట్ మెంట్‌ డెడ్ లైన్‌ విధించింది. బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి 11.59 గంటల కల్లా బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. సర్కిల్‌, జోనళ్ల వారీగా టెలికాం శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది.

టెలికం సర్వీసు ప్రొవైడర్లు శుక్రవారం అర్ధరాత్రి కల్లా బకాయిలన్నీ క్లియర్‌ చేయాలని యూపీ (పశ్చిమ) టెలికం సర్కిల్‌ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కాగా, టెలికాం శాఖ ఆదేశాల నేపథ్యంలో బకాయిలు చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ నెల 20న రూ.10వేల కోట్లు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఏజీఆర్‌ ఛార్జీల కింద బకాయి పడ్డ రూ.వేల కోట్లను ఇంకా ఎందుకు చెల్లించలేదని సుప్రీంకోర్టు శుక్రవారం టెలికాం సంస్థలను ప్రశ్నించిన నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ మేరకు పేర్కోంది.

టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 92 వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను వసూలు చేయవద్దంటూ సంబంధిత అధికారులకు టెలికాం మంత్రిత్వ శాఖ డెస్క్ ఆఫీసర్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. డెస్క్ అధికారితో పాటు టెలికాం సంస్థలకు కోర్టు ధిక్కార నోటీసులు పంపింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టును ఎత్తేద్దామా? అని ఆయన ప్రశ్నించారు. తమ ఆదేశాలనే డెస్క్ అధికారి పక్కనపెట్టేశారని... అతనికి అతను జడ్జిగా ఊహించుకున్నట్టున్నారని అన్నారు.

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సదరు అధికారి లేఖలు రాశారని... సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన ఎలా పక్కన పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎలాంటి న్యాయం మిగల్లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బతకడం కంటే... దేశాన్ని వదిలి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. తాను ఎంతో ఆవేదనకు గురవుతున్నానని... ఈ కోర్టులో పని చేయకపోవడమే మంచిదనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి వ్యవస్థలో ఎలా పని చేయాలని ప్రశ్నించారు. సదరు అధికారి నిర్ణయం వెనుక డబ్బు కోణం ఉందా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆ అధికారి జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles