Instead of seat for wife, he got death పిల్ల తల్లికి సీటు అడిగితే.. పిడిగుద్దులతో హత్య

12 people arrested for thrashing 26 year old man to death in express train

Kalyan, Daund railway station, Sagar Markad, Jyoti, general compartment, Mumbai-Latur-Bidar Express, Kurdiwadi, Solapur district, Maharashtra, Crime

A 26-year-old man was allegedly beaten to death by 12 persons, including six women, following an argument over a seat in the Mumbai-Latur-Bidar Express, the Government Railway Police said.

చంటిబిడ్డ తల్లికి సీటు అడిగితే.. పిడిగుద్దులతో హత్య

Posted: 02/14/2020 06:03 PM IST
12 people arrested for thrashing 26 year old man to death in express train

పావలా కోసం ప్రాణాలు తీసే కసాయిలు వున్నరన్న వార్తలు ఒకప్పుడు విన్నాం. కూకట్ పల్లిలో హోటల్ లో డబ్బులు చెల్లించే విషయంలో పావలా వద్ద రేగిన వివాదం ప్రాణాలు తీసిందన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి క్షణికావేశంలోనే మరో ప్రాణం కూడా అనంతవాయువులో కలిసిపోయింది. చిన్నపిల్లలు వున్న తల్లులను గౌరవించి వారికి సీట్లు కేటాయించడం మన సంప్రదాయం. కానీ ఇలాంటి సంప్రదాయం తెలియని ఓ 12 సభ్యుల ముఠా కొద్దిగా పక్కకు జరిగి సీటు ఇవ్వరా అన్నందుకు ప్రాణాలనే తీసింది.

రైలులో జనరల్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తున్న వ్యక్తి తమ బంధువుల అంత్యక్రియల కార్యక్రమాలకు తన తల్లి, భార్య, తన రెండేళ్ల కూతురితో కలసి వెళ్తూ.. వారి కళ్లెదురుగానే అనంతవాయువులో కలసిపోయారు. రైలులో సీటు కోసం జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. తన భార్యకు కూర్చోడానికి కొంచెం సీటు ఇవ్వమని కోరిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. అసుపత్రికి తరలిస్తుండగా ఆయన మార్గమధ్యంలోనే అసువులు బాసారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ఘటన మన ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ఘనకీర్తని చాటుతొంది. రైల్వేలో పాలకుల నిర్ణయాలను.. ఐఆర్సీటీసీ విధానాలకు కూడా దర్ఫణం పడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కళ్యాణ్ ప్రాంతానికి చెందిన సాగర్ మర్కద్(26) , అతనతి భార్య జ్యోతి, వారి రెండేళ్ల కుమార్తెతో కలిసి రైలు ఎక్కారు. బుధవారం రాత్రి సమయంలో వారు ముంబయి నుంచి లాటూర్ వెళ్లే బీదర్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. జనరల్ కంపార్ట్ మెంట్ మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. కూర్చోడానికి ఎక్కడా సీటు కూడా దొరకలేదు. చిన్న పాపతో భార్య పడుతున్న అవస్థ చూడలేక ఎవరినైనా సీటు అడగాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ వద్దకు వెళ్లి.. కొంచెం సర్దుకుంటే తన భార్యకూడా కూర్చుంటుందని.. చేతిలో చిన్నపాప ఉందని వెళ్లి కోరాడు.

సాగర్ మర్కద్ తనను పక్కకు జరగమని అనడంతో సీటులో కూర్చున్న మహిళ పట్టించుకోకపోగా.. సీటు అడిగాడని అతడ్ని పరుషపదజాలంతో దూషించింది. చిన్న పాప వుందని తాను సీటు అడిగినంత మాత్రాన.. సీటులో కూర్చున్న మహిళ అసభ్యపదజాలంతో దూషించడంతో సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే కొందరు అక్కడకు వచ్చిన 12మంది సాగర్ పై దాడి చేశారు. వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. వాళ్లందరూ ఒక్కసారిగా పిడిగుద్దుల వర్షం కురిపించడంతో.. సాగర్ తట్టుకోలేకపోయాడు.

తన భర్తను చుట్టుముట్టిన 12 మంది దారుణంగా కొడుతుండటంతో.. వదిలిపెట్టమని జ్యోతి వాళ్లను వేడుకుంది. అయినా వాళ్లు వినకుండా దాదాపు గంటపాటు కొట్టారు. ఆతర్వాత తీవ్రగాయాలపాలైన భర్త సాగర్ ని జ్యోతి పక్క స్టేషన్ లో రైల్వే పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందాడు. కాగా.. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. నిందితుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles