Provide reasons for fielding tainted netas, SC కళంకిత ప్రజాప్రతినిధుల ఆటలకు ‘సుప్రీం’ చెక్.!

List reasons for giving tickets to tainted candidates make details public sc to parties

Supreme Court, Decrimnalisation of politics, criminal cases, contesting candidates, political parties, Ashwini Kumar Upadhyay, central government, Election Commission, Cabinet Secretary, Law Secretary, Government of India, social media platforms, newspapers, crime

The Supreme Court directed political parties to upload on their websites the details of pending criminal cases against candidates contesting polls. The top court said there has been an alarming increase in criminalisation of politics in the last 4 general elections.

రాజకీయ పార్టీలు, కళంకిత ప్రజాప్రతినిధుల చమ్మక్కులకు ‘సుప్రీం’ చెక్.!

Posted: 02/13/2020 02:20 PM IST
List reasons for giving tickets to tainted candidates make details public sc to parties

నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికలలో గెలుపోందడం ద్వారా వారి నేరచరిత్ర కనుమరుగవుతుందని భావించడం తగదని అభిప్రాయపడిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. అదే సమయంలో కళంకిత ప్రజాప్రతినిధుల చమ్మక్కులకు రాజకీయ పార్టీల గిమ్మిక్కులకు చెక్ పెట్టింది. కళంకిత ప్రజాప్రతినిధులపై గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని క్యాబినెట్ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శల నుంచి వివరణను కూడా కోరింది. ఇదే సమయంలో ఎన్నికలను నేరచరిత్ర రహితంగా ఉంచేందుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై వివరణను వారం రోజుల్లో తమకు సమర్పించాలని న్యాయస్థానం కేంద్రఎన్నికల సంఘాన్ని అదేశించింది.

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2018 సెప్టెంబరు 25న ఇచ్చిన ఆదేశాలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ.. నేరచరిత్రుల నేరాలను బహిరంగపర్చకుండా వారు ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలో దోహదపడుతూ.. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నాయంటూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమణ్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ లతో కూడిన న్యాయస్థాన ధర్మాసానం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా మరోమారు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పనిసరిగా అమలుచేయాలన్న బెంచ్.. తాజాగా రాజకీయ పార్టీలు కూడా కళంకితులను ఎందుకు బరిలో దింపుతున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయాలను నేరరహితంగా మార్చేందుకు ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల నేర చరిత్ర.. వాటి వివరాలను, పార్టీలు ఆ అభ్యర్థులను బలపర్చినందుకు కారణాలను బయట పెట్టాల్సిందేనంటూ రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను తమ వెబ్ సైట్ లో అప్ లోడ్‌ చేయాలని స్పస్టం చేసింది. ఇక కళంకిత నేతలు ఎన్నికల బరిలో దిగుతున్న సందర్భంలో వారి గురించి దినపత్రికలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా గణనీయంగా ప్రచారాన్ని కల్పించాల్సిందేనని పేర్కోంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం వాదనలు వినిపిస్తూ..  కళంకితులకు రాజకీయ పార్టీలు బరిలో దింపకుండా ఆదేశాలను ఇవ్వాలని కోరింది.

సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ బీజేపి నేత, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ.. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయాల్లో నేరస్థుల సంఖ్య పెరుగుతూపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నేర చరిత్ర గల అభ్యర్థులపై 72 గంటల్లోగా ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని సూచించింది. సుప్రీం ఆదేశాలను రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తే గనుక ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని ఈసీని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles