"BJP Raghunandan Rao is not a leader.. but a broker" ‘‘రఘునందన్ రావు.. అమ్మాయిల బ్రోకర్’’

Bjp raghunandan rao is not a leader but a broker alleges complainant

M Raghunandan Rao rape case, raghunandan rao sexual assault case, raghunandan rao advocate divorce case, raghunandan rao Hasrassment, raghunandan rao Advocate, raghunandan rao nude Photos, raghunandan rao intimate videos, raghunandan rao blackmail, raghunandan rao BJP, raghunandan rao BJP Spokesperson, raghunandan rao, Hasrassment, Advocate, blackmail, BJP, Spokesperson, Hyderabad, Telangana, crime

After approaching SHRC and filing a case against the advocate M Raghunandan Rao, BJP leader in Telangana, the complainant alleged that he is not a Leader but a broker. He supplies girls and blue films to telugu movie stars.

‘‘బీజేపి రఘునందన్ రావు.. అమ్మాయిల బ్రోకర్’’: బాధితురాలి అరోపణ

Posted: 02/04/2020 05:48 PM IST
Bjp raghunandan rao is not a leader but a broker alleges complainant

బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన బాధితురాలు ఆయన లీడర్ కాదని అమ్మాయిలను తార్చే ఓ బ్రెకర్ అంటూ తీవ్ర పదజాలంతో అరోపణలు గుప్పించింది. అయన బ్యూ ఫిల్మ్ సప్లయర్ అని అరోపించిన ఆమె తనకు రఘునందన్ రావు గత 12ఏళ్లుగా నరకం చూపుతున్నాడని పేర్కోంది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ కు చెందిన బాధితురాలు.. ఈ విషయమై గతంలో పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా తన రాజకీయ పలుకుబడితో తనను అడ్డుకున్నాడని అమె తెలిపింది.

ఈ కేసు విషయమై ఇవాళ తాజాగా మరోమారు మీడియా ముందుకు వచ్చిన అమె.. రఘునందన్ రావుపై సంచలన అరోపణలు చేశారు. ఆయన అమ్మాయిలను తార్చే బ్రోకర్ అని.. నీలి చిత్రాల సప్లయర్ అని పేర్కోన్నారు. కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ రావు భయపెట్టి లొంగదీసుకుంటాడని బాధితురాలు ఆరోపించారు. అనంతరం వారితో బ్లూ ఫిలింగ్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పారు.

హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేది రఘునందన్ రావేనన్నారు. అతనే దగ్గరుండి పరిచయం చేయించి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుకు సప్లై చేయించేవాడని బాధితురాలు తెలిపారు. నీలిచిత్రాలకు సంబంధించిన యూనిట్ ముంబైలో ఉందని... అక్కడి నుంచి ఇవి సప్లయి అవుతూ ఉంటాయని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన బాగోతాన్ని పూర్తి ఆధారాలతో సహా తాను 2012లో పట్టిస్తే సీసీఎస్ పోలీసులు కేస్ క్లోజ్ చేశారని అరోపించారు. అయితే కేసును దర్యాప్తు చేయకుండా ఎందుకు క్లోజ్ చేశారని అడిగితే.. రఘునందన్ రావు చెప్పడంతోనే తాము క్లోజ్ చేశామని పోలీసులు బదులిచ్చారని బాధితురాలు తెలిపారు.

రఘునందర్ రావు మీకు బాస్ కాదుగా.. మీరు నేరం జరగుతున్నది వాస్తవమా.? కాదా.? అన్న కోణంలో విచారించి.. మీ ఉన్నతాధికారులకు బదులివ్వాలని తాను కోరితే.. ఈ విషయంలో మరింత ఎక్కువ జోక్యం చేసుకున్నా.. కేసు విషయమై నోరు జారినా.. ఎక్కడైనా మాట్లాడినా.. ఎన్ కౌంటర్ చేస్తానని సీఐ రాజశేఖర్ రెడ్డి తనకు బహిరంగంగానే ఎన్నోసార్లు బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో రఘునందన్ రావు, సిఐ రాజశేఖర్ రెడ్డిలు మంచి మిత్రులయ్యారని.. దీంతో తనపై కక్ష పెట్టుకుని తనను చంపేందుకు రఘునందన్ యత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ కేసు విషయమై తాను ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసినా.. వారు తమ హోదా, పలుకుబడితో అడ్డుకుంటారని బాధితురాలు అవేధన వ్యక్తం చేశారు. రఘునందన్ రావును అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేసి, వ్యాపారాలు చేస్తున్నారని బాధిత మహిళ మండిపడ్డారు. సంవత్సరం పాటు కేసు తీసుకోకుండా తనను ప్రతిరోజూ తిప్పేవారని.. రఘునందన్ రావు వచ్చి తనకు అడ్డుపడేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంఘంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వీళ్లు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా, తనపై వస్తున్న ఆరోపణల పట్ల రఘునందన్ స్పందించారు. ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నూటికి నూరు శాతం అవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఈ అంశంలో తనమీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మరోసారి వివరణ ఇస్తానని వెల్లడించారు. అంతేకాదు, తనకు ఈ వ్యవహారంలో ఎవరూ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles