రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న అమరావతి ప్రాంత రైతుల అందోళనలు నేటికి 48వ రోజుకు చేరకున్నాయి. అమరావతి గ్రామాల రైతులు, మహిళలు, విద్యార్థులు చేస్తున్న అందోళనలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి.. పాలనా వికేంద్రీకరణ బిల్లను తక్షణం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటలు సాగుతాయని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు.
మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలతో పాటు స్థానిక విద్యార్థి, యువజన నాయకులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతిపై విపక్షంలో వుండగా ఒకలా.. అధికార పక్షంలో వుండగా మరోలా నిర్ణయం తీసుకుంటామని ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని.. కనీసి ఈ విషయాన్ని వారి మానిఫెస్టోలోనైనా ఎందుకు జోడించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రమే తమ ప్రభుత్వ నిర్ణయాలు కూడా మారాలా.? అని ప్రశ్నిస్తున్నారు.
‘ప్రాణాలైనా అర్పిస్తాం ... అమరావతిని సాధిస్తాం’ అంటూ నినదించారు. పాలనా వికేంద్రకరణ ద్వారా అభివృద్ది సాధ్యమెలా అవుతుందని ప్రశ్నిస్తున్న నిరసనకారులు.. అభివృద్ది వికేంద్రీకరణకు అనుకూలంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రైతుల ఆందోళనలు ఉదయం నుంచే కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతాల్లోని 29 గ్రామాల్లో ఈ ఆందోళనలను కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు.
మరోవైపు వెలగపూడిలో రైతుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చామని, రైతుల త్యాగాలను గుర్తించకుండా ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం తీసుకున్న భూములు ఇప్పుడు తిరగిస్తామని అంటున్నారని, ఏడాదికి మూడు పంటలు పండే భూములు తీసుకున్న ప్రభుత్వం రోడ్డు, కంకర వేసిన భూములను ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో 29 గ్రామాల ప్రజలను రోడ్డున పడేసి.. రాష్ట్రానికి గౌరవమైన రాజధాని లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని వెనక్కితీసుకునేంత వరకు పోరాటం చేస్తామని రాజధాని రైతులు తెగేసి చెబుతున్నారు.
నిన్న మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు.. తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. కాగా, ఇవాళ మరో మహిళా రైతు మరణించడంతో అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో విషాదం నెలకొంది. రాజధాని అంశంపై ఆవేదనతో భారతి (55) అనే మహిళా రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మృతి చెందారు. రాజధాని కోసం ఆమె కుటుంబం తమకున్న అర ఎకరం భూమిని ఇచ్చింది. రాజధాని ఉద్యమంలో ఆమె చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఒత్తిడిని జయించలేక చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అందోళనల్లో కొనసాగిన ఆయన తవ్ర మనస్తాపానికి గురై అసువులు బాసారు. రాజధానిపై అందోళనతో ఇవాళ తెల్లవారు జామున ఆయన మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. మృతుడి కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించారు. మరోవైపు రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఇదిలావుండగా.., రైతు సంఘాల నాయకులతో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన చర్చా కార్యక్రమం ముగిసింది. వివిధ జిల్లాల రైతు సంఘాల నాయకులు, జేఏసీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసింది. రైతులు, మహిళలకు అండగా ఉండాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, అమరావతిలోని ప్రస్తుత భవనాల నిర్మాణాలను పూర్తి చేసి పాలన ఇక్కడి నుంచే సాగించాలని, అన్ని జిల్లాల అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాలని, అమరావతి రైతులకు మద్దతుగా జిల్లాల నుంచి బస్సు యాత్ర చేయాలని, ఏడాది కార్యక్రమాలపై దీర్ఘ కాలిక ప్రణాళిక రూపొందించాలని మొదలైన తీర్మానాలు చేసింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more